తెలంగాణాలో అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అయిన టీఆరెస్ కు ఎదురీత తప్పేలా లేదు. ప్రస్తుత రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలను చేస్తే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. మొత్తానికి  హుజుర్ నగర్ ఉప ఎన్నిక ఆసక్తికరంగా జరుగుతుంది. అధికార పక్షం అవలంభిస్తున్న వైఖరికి తగిన బుడ్డి చెప్పాలన్న పంధాలో ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతున్నటు కనిపిస్తుంది. ఏదిఏమైనా సరే టీఆర్‌ఎస్‌ను మానసికంగా దెబ్బతీయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయా అన్న చర్చ ప్రతి రచ్చబండ పైన వాడివేడిగా జరుగుతుంది. హుజూర్ నగరర్ లో సాగుతున్న ఉప ఎన్నికలో ఇప్పుడు పోటీ రెండు పార్టీల మధ్యనే మారిందన్నది రచ్చబండ వాదన.టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ నెలకొని ఉంది. ఇక్కడ బీజేపీ, తెలుగుదేశం పార్టీలు కూడా నామినేషన్లు వేసినా.. ప్రచారంలోనే అవి వెనుకబడిపోయాయి.



ప్రజలు కూడా కూడా కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యనే ఎవరో ఒకరు అన్నట్టుగా ఉన్నట్టుగా రచ్చబండ వేదిక తీర్పునిస్తుంది. కాగా ప్రస్తుతం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అధికార పార్టీ కాస్త నెగిటివిటీని ఫేస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా  పొలిటికల్‌ వార్ రూముల్లో అయితే చర్చ ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఈ చర్చల్లో చాలా కీలకమైన అంశాలు చర్చకు వస్తున్నట్టు సమాచారం.  తమ ఎమ్మెల్యేలు అందర్నీ లాక్కున్నారని కాంగ్రెస్ పగతో రగిలిపోతుంది. ఇప్పటికే ఈ పార్టీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అంతో ఇంతో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చేందుకు సర్వసన్నర్ధమవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు బీజేపీ అధికార పక్షంపై ఒంటికాలుపై నిలబడుతోంది. ఆర్టీసీ కార్మికుల సమ్మె కారణంగా మద్దతునిస్తానన్న సిపిఐ పొత్తు ఉందని చెప్పడం గమనార్హం. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నిక పోరు  ఆసక్తిదాయకంగా మారింది.ఎన్నిక మరో రెండు రోజుల్లో జరగనుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ..పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఎలా మారతాయో వేచి చూద్దాం.




హుజుర్‌నగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. ప్రధాన పార్టీలతో పాటు పెద్ద ఎత్తున ఇండిపెండెంట్లు బరిలో దిగారు. అయితే ప్రధాన పోటీ మాత్రం టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే కనిపిస్తోంది. అధికార పక్షమైన టీఆర్ఎస్..టాక్ వినిపిస్తోంది. ఏది కనిపించినా, మరేదో వినిపించినా కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం హుజుర్ నగర్ మాత్రం మాదే అంటున్నారు. ఇక హుజుర్ నగర్‌లో సీఎం కేసీఆర్ సభ రద్దు కావడం హస్తం గూటిలో మరింత జోష్ కనిపిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ పక్కనబెడితే..అక్కడ లోపాయికారీ ఒప్పందాలు జరుగుతాయన్న చర్చ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. లోక్ సభ ఎన్నికల సమయంలో.. తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు లోపాయి కారీగా సహకరించుకున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి వాదిస్తూ ఉంటుంది. ఇక నిజామాబాద్  పార్లమెంట్ స్థానంలో.. బీజేపీ విజయానికి కాంగ్రెస్ పార్టీ సహకారమే కీలకమని టీఆర్ఎస్ నేతలు అప్పట్లో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మరి ఓటర్ల నిర్ణయం ఎలాఉండబోతుందో ఎన్నికల ఫలితాలను చేస్తే కానీ తెలియదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: