తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు చేపట్టిన సమ్మె ఈరోజు జరిగి పది రోజులు దాటినా కూడా కెసిఆర్  గారు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పెడుతున్న విషయం అందరికీ తెలిసినదే తమ ఉద్యోగం ఊడింది బాధతో కొందరు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిన విషయమే ఈ విషయం పైన మొన్ననే హైకోర్టు కూడా ప్రభుత్వం మీద అక్షింతలు వేసింది వెంటనే ఆర్టీసీ ఆర్టీసీ కార్మికుల సమస్యలపై వెంటనే చర్చను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది .

ఈ విష్యం పైన తెలంగాణ గవర్నర్ ఆర్టీసీ సమ్మెలో జోక్యం చేసుకుంటారని ప్రభుత్వం అంచనా వేకలేకపోయింది. సాధారణంగా గవర్నర్ ఏదైనా ప్రభుత్వ పరమైన అంశాలుంటే నేరుగా ముఖ్యమంత్రితో చర్చిస్తారు. కానీ, ఇప్పుడు గవర్నర్ నేరుగా మంత్రికి ఫోన్ చేసారు. ఆర్టీసీ సమ్మె గురించి ఆరా తీసారు. ఆ సమయంలో తన వద్దకు వచ్చిన రాజకీయ పార్టీలు..ఆర్టీసీ జేఏసీ నేతలు ఇచ్చిన సమాచారం మేరకు అసలు ఏం జరుగుతోందరి ఆరా తీసినట్లు తెలుస్తోంది. నేరుగా మంత్రికి ఫోన్ చేయటంతో..ఆయన సైతం ఉన్న పరిస్థితిని వివరించినట్లుగా చెబుతున్నారు.

ఆ సమయంలో గవర్నర్ వేసిన ప్రశ్నలతో మంత్రి ఇబ్బంది పడినట్లుగా ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. గవర్నర్ నేరుగా మంత్రి వ్వాడ అజయ్‌ కుమార్‌కు ఫోన్‌ చేసి ఆరా తీశారు. సమ్మె తీవ్రత, సెల్ఫ్‌ డిస్మిస్‌ పేరుతో కార్మికుల తొలగింపు వంటి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. అసలేం జరుగుతోందంటూ మంత్రిని ప్రశ్నించారు. సెల్ఫ్ డిస్మిస్ అనే పదం ఉందా అని గవర్నర్ నుండి ప్రశ్న రావటంతో మంత్రి సమాధానం ఇవ్వటానికి ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. 48 వేల మంది కార్మికులు తొలగిపోయినట్లు ఎలా చెబుతారని నిలదీసినట్లు తెలిసింది. కోర్టు ఆదేశాలు అమలవుతున్నాయా అని ఆరా తీసారు.


ఆర్టీసీ సమ్మెకు తోడుగా ఓలా మరియు ఉబర్ లాంటి క్యాబ్ సర్వీసులు కూడా ఈ నెల 19వ తారీకు నుండి సమ్మె చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు దీనివల్ల నగర ప్రజలు మరియు ప్రయాణికులు చాలా అవస్థలు పడే అవకాశాలు చాలా ఉన్నాయి ప్రభుత్వము ఆర్టీసీ సమ్మెకు ఎంత త్వరగా పరిష్కారం చూపితే అంత మేలు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: