ఈమధ్య ప్రైవేట్ ఆసుపత్రులు పేషంట్ ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్న సమస్యతో వెళ్ళిన దాన్ని  పెద్ద సమస్యగా కవరింగ్ ఇచ్చి బాగా డబ్బులు దండుకుంటున్నారు. ఇంకొంతమంది అయితే నిర్లక్ష్యంగా ఆపరేషన్స్ చేస్తూ... ప్రజల ప్రాణాలను గాల్లో కనిపెస్తున్నారు. ఇక్కడ ఇలాంటి ఘటన జరిగింది. చిన్న జబ్బుతో ఆసుపత్రికి వెళ్తే లేని జబ్బులు సృష్టించి ఉన్న  ప్రాణాలను గాల్లో కలిపేశారు అక్కడి డాక్టర్ లు . జలుబు చేసింది అంటూ  హాస్పిటల్ కి వెళ్తే వైద్యుల  నిర్లక్ష్యం కారణంగా... ఆమె మృతి చెందింది. ఆపరేషన్ చేస్తామంటూ చెప్పిన డాక్టర్లు చికిత్స చేస్తుండగా వివాహిత మృతి చెందగా అక్కడినుంచి మెల్లగా జారుకున్నాడు. హైదరాబాద్లోని కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. 

 

 

 

 సంగారెడ్డి జిల్లా గొర్రెకల్ గ్రామానికి చెందిన స్వాతికి  అదే గ్రామానికి చెందిన సుంకర నవీన్ కుమార్ లకు రీసెంట్ గా పెళ్లి జరిగింది . అయితే స్వాతి జలుబుతో పాటు  టాన్సిల్ తో కూడా బాధపడుతుండంతో తన భర్తతో కలిసి కాచిగూడా లోని సిసి  షారఫ్  ఆస్పత్రికి వెళ్ళింది . అయితే అక్కడి పేషంట్లు ఎక్కువ ఉండండంతో  వాళ్ళని చైతన్యపురిలోని తన తన క్లినిక్ కి  రమ్మని సూచించాడు వైద్యుడు. వైద్యుడి సలహా మేరకు చైతన్య పురి లోని  క్లినిక్ కి వెళ్లిన స్వాతి అక్కడ వైద్య పరీక్షలు చేయించాక... ట్యాన్సిల్  తో బాధపడుతున్న స్వాతికి సర్జరీ ద్వారా నయమవుతుంది చెప్పాడు వైద్యుడు . సర్జరీని ఆస్పత్రిలో చేస్తానని వైద్య చెప్పాడు.కాగా సర్జరీ నిమిత్తం స్వాతి తన కుటుంబ సభ్యులతో ఆసుపత్రికి వెల్లింది. కాగా సర్జరీ  కోసం స్వాతిని  ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు వైద్యులు . అయితే మధ్యాహ్నం మూడు గంటలు దాటిన డాక్టర్లు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రాలేదు. దీంతో అనుమానం పడిన స్వాతి భర్త బంధువులు డాక్టర్ నిలదీయగా... స్వాతి బాడీ  చికిత్సకు సహకరించడం లేదని వైద్యులు తెలిపారు . ఇక ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు స్వాతి మృతి చెందినట్లు... చెప్పిన డాక్టర్లు ఆస్పత్రి నుంచి మెల్లగా జారుకున్నారు . 

 

 

 

 అయితే దీనిపై ఆగ్రహించిన స్వాతి భర్త, బంధువులు వైద్యుల  నిర్లక్ష్యం కారణంగానే స్వాతి చనిపోయిందని ఆరోపించారు . డాక్టర్ రామకృష్ణ అనస్తీషియా స్పెషలిస్ట్ డాక్టర్ మల్లికార్జున్ వల్లనే స్వాతి మృతి చెందిందని ఆరోపించారు. దీంతో ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. అయితే ఈ ఘటనపై స్వాతి బంధువులు పోలీసులకి పిర్యాదు చేయగా...  పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: