టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి చిన్న విషయం బయట ప్రపంచానికి తెలిసిపోతున్నది.  ఎక్కడ ఎలాంటి విషయాలు జరిగినా వెంటనే అవి సోషల్ మీడియాలో వైరల్ కావడం.. నానా రచ్చ జరగడం జరుగుతున్నాయి.  ముఖ్యంగా కాలేజీ, యూనివర్శిటీల్లో చదివే పిల్లల చేతుల్లో మొబైల్ ఫోన్లు ఖచ్చికంగా కనిపిస్తాయి.  ఆ మొబైల్ ఫోన్లు వలన ఉపయోగం ఎంతవరకు ఉన్నదో దానికంటే ఎక్కువగా నష్టాలే ఉన్నాయి.  


గంటల తరబడి మొబైల్ ఫోన్లలో వీడియోలు చూసుకోవడం.. ఇతర విషయాల గురించి చర్చించుకోవడంతోనే సరిపోతుంది.  ఫలితంగా చదువును పక్కన పడేస్తున్నారు.  పైగా వయసులో ఉన్న యువత నెగెటివ్ వార్తలకు బాగా ఎట్రాక్ట్ అవుతారు.  వయలెంట్ విషయాలను ఎక్కువగా షేర్ చేస్తుంటారు. ఇలా ఎన్నో రకాల నష్టాలు మొబైల్ ఫోన్ల వలన కలుగుతున్నాయి.  


అనేకాదు, ఇప్పుడు ఇప్పటి యువత మొబైల్ ఫోన్లలో ఎక్కువగా పోర్న్ వీడియోలు చూస్తూ సమయాన్ని, జీవితాన్ని వృధా చేస్తున్నారు.  ఇది వారి జీవితంపై ప్రభావం చూపుతున్నది. ఇటీవలే మొబైల్ ఫోన్లలో పోర్న్ సినిమాలు చేసే వారికీ కఠిన శిక్షలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. కాలేజీ యువత వీటికి ఎట్రాక్ట్ అవుతుంది.  వీటిని అరికట్టాలి అంటే చదుకునే పిల్లలకు మొబైల్ ఫోన్లు దూరంగా ఉంచాలి.  


ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇదే విధమైన నిర్ణయాన్ని తీసుకుంది.  కాలేజీ, యూనివర్శిటీలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేదించింది.  ఈ సంచలనాత్మకమైన నిర్ణయం అందరిని షాక్ కు గురిచేసింది.  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే మొబైల్ ఫోన్లు తీసుకెళ్తే.. శిక్షలు కఠినంగా ఉంటాయని హెచ్చరించింది. మరి ఈ హెచ్చరికలను కాదని యువత మొబైల్ ఫోన్స్ ను తీసుకెళ్తుందా.. తీసుకెళ్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే యూపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు ఏ మేరకు స్వాగతిస్తాయో కూడా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: