ఈ మధ్య ఎవరి నోట చూసిన గూగుల్ పే మాట . ఇప్పుడు అంతా ఆన్లైన్ ప్రెమెంట్స్ ప్రపంచం నడుస్తుంది. దీనికోసం ఎన్నో యాప్స్ వచ్చిన... గూగుల్ పే మాత్రం తన హవా నడిపిస్తుంది.   హాయిగా  రెస్టారెంట్ కి వెళ్లి బిర్యానీ తినేయాలన్న ... గ్రోసరీ షాప్ కి  కూరగాయలు కొనాలన్నా.... ఎక్కడో  ఉన్న మన బంధువుల డబ్బులు పంపలన్న... ఇప్పుడు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే సరిపోతుంది... గూగుల్ పే  ఓపెన్ చేసి ఒక్క క్లిక్ ఇస్తే  చాలు...అన్ని చేసేయొచ్చు . కాగా ప్రస్తుతం ఆన్లైన్ పేమెంట్ యాప్ లలో  అందరినీ ఆకర్షిస్తున్న  యాప్  గూగుల్ పే. అకౌంట్లో డబ్బులు ఉన్నా లేకున్నా... స్మార్ట్ ఫోన్ లో మాత్రం గూగుల్ పే  తప్పక  ఉంటుంది. స్మార్ట్ ఫోన్ లేని మనిషి లేడు అన్నది ఎంత నిజమో.... ప్రస్తుత రోజుల్లో గూగుల్ పే లేని  స్మార్ట్ ఫోన్ లేదు అన్నది కూడా అంతే నిజం . ఆన్లైన్ పేమెంట్స్  లో గూగుల్ పే అంతలా ప్రభావితం చేసింది ప్రజలను. 

 

 

 

 

 ఈజీగా  పేమెంట్ లు  చేస్తుండడం... పేమెంట్ చేయటానికి   మంచి సెక్యూరిటీ  ఉండటంతో  ఎక్కువ మంది ప్రజలు గూగుల్ పే పైనే మొగ్గుచూపుతున్నారు. అయితే ఆన్లైన్ పేమెంట్ చేయడానికి ఎన్నో యాప్స్  వచ్చినప్పటికీ... గూగుల్ పే మాత్రం తన హవా నడుపిస్తుంది. అందుకే ఎక్కువ మంది ప్రజలు గూగుల్ పే నుండే  ఆన్లైన్ పేమెంట్ చేయడానికి మొగ్గు చూపుతున్నారు. బ్యాంకు వెళ్లాల్సిన పని లేకుండా తమ అకౌంట్లో నుండి వేరే వాళ్ళ అకౌంట్లోకి డైరెక్ట్ గా గూగుల్ పే  ద్వారా పంపేందుకు వెసులుబాటు ఉండడంతో... ప్రజలందరికీ పేమెంట్స్ చేయటం ఈజీగా  మారింది. అయితే ఎక్కువమంది ప్రజలు గూగుల్ పే  వాడుతుండటంతో... సైబర్ నేరగాళ్లు కూడా గూగుల్ పే పై  గట్టిగానే దృష్టిపెట్టారు. 

 

 

 

 

 అయితే వినియోగదారుల కోసం క్యాష్ బ్యాక్  లు కూడా ఇస్తుండడంతో వినియోగదారులు గూగుల్ పే  నుంచి ఎక్కువ పేమెంట్ చేస్తున్నారు. కాగా గూగుల్ పే టార్గెట్ చేసిన సైబర్ నేరాలు... మీరు ఎంత డబ్బు పంపిస్తే అంత డబ్బు డబుల్  అవుతుందని చెప్పడంతో... వినియోగదారులు ఆకర్షితులై డబ్బు పంపించి మోసపోతున్నారు. అయితే వీరి ఉచ్చులో పడి డబ్బులు పంపి మోసపోతున్న ప్రజల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఢిల్లీ, నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లు .. దక్షిణ భారతదేశంలోని పలు ప్రాంతాల్లో రోజుకి కోట్లు కొల్లగొడుతున్నారు . బాధితుల్లో తెలుగు రాష్ట్రలకి చెందిన  హైదరాబాద్, వరంగల్ వైజాగ్,  విజయవాడకు చెందిన వారు కూడా ఉన్నారు . అయితే గూగుల్ పే వినియోగదారులు  సైబర్ నేరగాళ్లు ప్రకటిస్తున్న ఆఫర్లకి  ఆకర్షితులై  మోసపోవద్దని సైబర్ పోలీసులు   సూచిస్తున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: