తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మె రోజు  రోజుకు ఉధృతమవుతోంది. కాగా ఈ నెల 5న మొదలుపెట్టిన సమ్మె నేటితో 14 వ రోజుకు చేరుకుంది. అయితే ఆర్టీసీ సమ్మె 14 రోజులకు  చేరుకున్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల  పరిష్కారంపై మొండిపట్టు విడడంలేదు. సమ్మె చేస్తున్న 50 వేల మంది ఆర్టీసీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించడమే  కాకుండా కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసారు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు . కాగా ఆర్టీసీ కార్మికుల రోజుకో విధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా రేపు తెలంగాణ బంద్ నిర్వహించనున్నారు . కాగా ఆర్టీసి సమ్మె కు  రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. 

 

 

 

 ఈనెల 19న ఆర్టీసీ కార్మికులు తెలంగాణ వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తుండడం... అటు టాక్సీ డ్రైవర్లు ఓనర్లు  కూడా సమ్మెకు పిలుపునివ్వడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక హైకోర్టులో సమ్మె పై నేడు కీలక తీర్పు... తాజాగా జరిగిన విచారణలో  కార్మికులు,  ప్రభుత్వం పంతాలకు పోకుండా చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. కాకా నేడు హైకోర్టులో ఎలాంటి తీర్పు వెల్లడవుతుంది అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. 

 

 

 

 

 కాగా ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెకు  అసలు ఇతర ఉద్యోగ సంఘాలు సహకరించాలని విపక్ష పార్టీల నేతలు కోరారు . ప్రజా రవాణా వ్యవస్థను కాపాడేందుకు ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయ్యి ... స్వచ్ఛందంగా వ్యాపార వాణిజ్య సముదాయాలు బంద్ కు  మద్దతు పలకాలని కోరారు. కాగా రేపటి తెలంగాణ బంద్ కు  సంఘీభావంగా బిజెపి ఆధ్వర్యంలో బైక్ రాలి నిర్వహించగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ స్వయంగా బైక్ నడిపి  ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లక్ష్మణ్  కెసిఆర్ కార్మికుల విషయంలో నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కార్మికుల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడంలేదని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: