తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె రోజు రోజుకి తీవ్ర స్థాయిలో పెరిగిపోతుంది. నేడు గాంధీభవన్‌లో జరిగిన  మీడియా సమావేశంలో  కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ ఆర్టీసీ కార్మికుల శాపం కేసీఆర్ కుటుంబానికి తగులుతుందని కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యానాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సంపదలో ఆర్టీసీ కార్మికులు కూడా భాగస్వాములని మధుయాష్కీ తెలియచేయడం జరిగింది. ఇక కేసీఆర్ సర్కార్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.


పక్క రాష్ట్రంలో  ఆర్టీసీ కార్మికులు  ప్రభుత్వ ఉద్యోగులుగా మారడం జరిగింది.. కానీ సొంత రాష్ట్రంలో కార్మికులు ఉద్యోగాలు పోగొట్టుకోవడం విషయం చాలా బాధాకరం అని తెలిపారు మధుయాష్కీ. ఈ సందర్భంగా  ఆర్టీసీ కార్మికులకు మీ ఉద్యోగాలు ఎవరివి ఎక్కడ పోవు కార్మికులు ఏటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అయినా తెలియచేసారు.


 తెలంగాణ ఆస్తులు దోచుకోవడానికి ఇద్దరు సీఎంలు ఏకమయ్యారు అని తీవ్ర వ్యాఖ్యానాలు కూడా చేశారు మధుయాష్కీ. నిజానికి సమ్మె 50వేల మంది ఉద్యోగులది కాదు 5 కోట్లమంది ప్రజల సమస్య అని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు కార్మిక చట్టాలకు చాల వ్యతిరేకంగా ఉన్నాయి. ఇక ఆర్టీసీ నష్టాలు ఒక కట్టు కదా..? అంతా  ఆర్టీసీ ఆస్తులను కుటుంబ సభ్యులకు కట్టబెట్టే కుట్ర చేయబోతున్నారు అని ఆరోపణలు చేశారు.


ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే పదవులకు ఆశపడి ఆర్టీసీ కార్మికులకు మోసం చేయొద్దు అని ఈ సందర్బంగా తెలిపారు. మలిదశ ఉద్యమానికి ప్రజలంతా సిద్ధం కావాలి అని అయినా కోరారు. తెలంగాణను వ్యతిరేకించిన ఏపీ సీఎం జగన్‌తో ఎలా కలిసి పనిచేస్తారు..?’ అని మధుయాష్కి సూటి ప్రశ్న కూడా వేయడం జరిగింది. రేపు జరగబోయే బంద్‌కు ప్రజలంతా మద్దతు పలకాలి అని అయినా కోరడం జరిగింది. మరి రేపు బంద్ ఎలా జరుగుతుందో చేయాలి...



మరింత సమాచారం తెలుసుకోండి: