హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై వాదనలు జరుగుతున్నాయి.  ఆర్టీసీ కార్మికులు గత 12 రోజులుగా సమ్మె చేస్తున్నారు.  ఈ సమ్మెలు ఆర్టీసీకి చెందిన వేలాది మంది కార్మికులు పాల్గొన్న సంగతి తెలిసిందే.  అయితే, సమ్మె చేస్తున్న కార్మికులను ప్రభుత్వం పక్కన పెట్టింది.  వారిని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్టుగా ప్రకటించింది.  దీంతో కార్మికులు సమ్మెను మరింత ఉదృతం చేశారు.  ప్రజలు గత 13 రోజులుగా ప్రయాణం చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు.  


సమ్మెను చేస్తున్న కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని, వారి డిమాండ్ల విషయంలో ప్రభుత్వం శ్రద్ద చూపాలని హైకోర్టు పేర్కొన్నది.  అయినప్పటికీ కెసిఆర్ ప్రభుత్వం దాని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు.  దీంతో మరలా మొదటికి వచ్చింది.  ప్రభుత్వం చర్చలు జరిపి అక్టోబర్ 18 వ తేదీన కోర్టుకు నివేదిక అందజేయాలని పేర్కొన్నా.. కెసిఆర్ మాత్రం ఆ దిశగా ఆలోచించలేదు.  సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.  


దీంతో కార్మికులు రేపు తెలంగాణ బంద్ కు పిలుపును ఇచ్చిన సంగతి తెలిసిందే.  కార్మికులతో పాటు అటు వివిధ పార్టీలు కూడా బంద్ కు మద్దతు ఇస్తున్నాయి.  రేపటి రోజున బంద్ చేస్తుండటంతో ముందస్తు చర్యగా ఇప్పటికే ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  మరికొంతమంది నేతలకు కూడా అరెస్ట్ చేస్తున్నారు.  ఎంతమందిని అరెస్ట్ చేసినా బంద్ మాత్రం జరుగుతుదని ఆర్టీసీ కార్మికులు చెప్తున్నారు.  


అయితే, ఆర్టీసీ ఎండీని నియమించడకపోవడం వలనే ఈ సమస్య వచ్చిందని, తప్పకుండా ఎండీని నియమించాలని చెప్పగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్టీసీ ఎండీని నియమించడం సాధ్యం కాదని, అసలే ఆర్టీసీ నష్టాల్లో ఉందని అంటున్నారు.  నష్టాలకు కారణాలను కోర్టులో ప్రభుత్వం నివేదిక అందించింది.  అటు ఆర్టీసీ కార్మికులు కూడా తమ నివేదిక అందజేశారు.  వివిధ వర్గాలు, వివిధ సంఘాలు ఆర్టీసీకి మద్దతుగా నిలుస్తున్నాయి.  మరి కోర్టు దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.  ఒకవేళ రేపు బంద్ జరిగితే దాని వలన ప్రభుత్వం చాలా నష్టపోవాల్సి వస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: