ఆంధ్ర ప్రదేశ్ లో సచివాలయ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరుకు ఇదె తంతు అది పరీక్ష పెట్టిన తర్వాత, సచివాలయ ఉద్యోగాలు రీజల్ట్ వచ్చాక ఇక బారీ స్థాయిలో నిరసనలు చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే కదా. ఇప్పుడు సచివాలయ పరీక్షలలో పాసైన వారు కూడా నిరసనలు చేస్తున్నారు. పరీక్షా పాసైన అభ్యర్థులు ఎపి సర్కార్ ని ప్రశించడం మొదలు పెట్టారు. అభ్యర్థులు మేము పాసైన కూడా మాకు ఉద్యోగం రాలేదు అని జగన్ సర్కార్ పై మండి పడుతున్నారు.


ఇటీవల  గ్రామ సచివాలయాల పరీక్షలో పాసైయి, ఉద్యోగాలకు కూడా ఎంపికైన ఉద్యోగా అభ్యర్థులకు  ఉద్యోగం వచ్చినట్లే వచ్చి మల్లి పోవడం జరిగింది. వాళ్ళకి 
ఉద్యోగానికి ఎంపికైనట్టు పోస్టింగ్‌ లెటర్స్‌ కూడా రావడం జరిగాయి. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తి అయంది, నియామక పత్రాలు అందజేసినా ప్లేస్‌మెంట్‌ ఆర్డర్స్‌ ఇస్తామని చెప్పి , తీరా చుస్తే తమ పోస్టులు లేవని చెప్పడంతో అభ్యర్థులు నిరాశకు గురి అయ్యారు. 


ఇక నష్టపోయిన అభ్యర్థులలో  కొవ్వూరుకు చెందిన గణేష్‌, ఏలూరుకు చెందిన రాజేష్‌తో పాటు పలువురు యువత ఇటీవల జరిగిన గ్రామ సచివాలయాల ఉద్యోగాలకు సంబంధించి ఒకరు వార్డు శానిటేషన్‌ ఎన్విరాన్‌మెంట్‌ సెక్రటరీ ఉద్యోగానికి కూడా ఎంపిక అయ్యారు అని తెలిపాడం జరిగింది. దీనికి సంబంధించి కాల్‌ లెటర్లు కూడా వాళ్ళకి అందడం కూడా జరిగాయి. తర్వాత ప్రక్రియలో ధ్రువపత్రాల పరిశీలన కూడా పూర్తి కావడం జరిగింది. 


ఈ నెల 2వ తేదీన నియామక పత్రాలను సైతం అందుకున్నారు. కానీ ఇప్పుడు తీరా చుస్తే తమ ఉద్యోగాలు లేవని చెప్పడం పట్ల అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు తాము చేస్తున్న ఉద్యోగాలు సైతం పక్కకి పెట్టి వదిలేసి రావడం జరిగింది అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేయడం జరిగింది 



మరింత సమాచారం తెలుసుకోండి: