తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నేటితో 14 రోజుకు చేరుకుంది. అయితే ఇప్పటి వరకు కార్మికులు డిమాండ్ పై సరైన చర్చలు జరపలేదు ప్రభుత్వం. అంతేకాకుండా సమ్మెలో పాల్గొంటున్న 50వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా  ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి వాళ్ల డిమాండ్లను పరిష్కరించే  ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది ప్రభుత్వం. కాగా దీనిపై ఆర్టీసీ కార్మికులు తమకు న్యాయం చేయాలని కోర్టులో తన వాదన వినిపించారు. అయితే కార్మికుల పిటీషన్ పై  స్పందించిన కోర్టు గతంలో విచారణ జరిపి... కార్మికుల ఆత్మహత్యల వల్ల  సమస్యలు పరిష్కారం కావని అటు  ఆర్టీసీ కార్మికులు కానీ ఇటు ప్రభుత్వం కాని ముందుకు వచ్చి చర్చలు జరిపి తమ సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. అలాగే ఆర్టీసీ సంస్థకు ఎండీ ని  నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

 

 

 

 కాగా తాజాగా నేడు హైకోర్టులో ఆర్టీసీ సమ్మెపై విచారణ జరిగింది. ఈ విచారణలో ఆర్టీసీ సమ్మె పై ప్రభుత్వం పై సీరియస్ అయింది కోర్టు. ఆర్టీసీ ఎండి నియమించాలని గతంలోనే చెప్పినప్పటికీ ఎందుకు నియమించలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 14 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించింది కోర్టు .సమ్మె  రోజు రోజుకు ఉధృతమవుతోందని...  ఒకవేళ సమ్మెకు అందరూ మద్దతు తెలిపి ప్రజలందరూ ప్రభుత్వంపై తిరగపడితే   ఏం చేస్తారు అని ప్రశ్నించింది.  ప్రజాస్వామ్యంలో ప్రజలదే  రాజ్యం అని ప్రజలు తిరగబడితే ఏం చేయలేమని చెప్పింది హైకోర్టు. ఇంకొన్ని రోజులు ఇలాగే ఊరుకుంటే సమ్మె తీవ్రతరమై రాష్ట్రంలో పరిస్థితులు చేయి దాటి పోయే పరిస్థితి ఏర్పడుతుందని హైకోర్టు తెలిపింది. 

 

 

 

 

 అయితే గత విచారణలో కార్మికులు అటు ప్రభుత్వం చర్చలు జరిపితే  ఆర్టీసీ సమస్యలు పరిష్కారమవుతాయని... చర్చ జరగకుండా సమస్యలు పరిష్కారం కావని  తెలిపింది హైకోర్టు . ఇక నేడు తెలంగాణ ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో వాదనలు జరిగాయి.ఇక తాజాగా కూడా 14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్ లతో ప్రభుత్వం చర్చలు జరపాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు టిఎస్ఆర్టిసి కార్పొరేషన్ ఆదేశించింది హైకోర్టు. ఆర్టీసీ సమావేశంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన  హైకోర్టు... 10.30 గంటలకు ఆర్టిసి యూనియన్ లతో చర్చలు జరిపాలని ఆర్టీసీ యాజమాన్యానికి కోర్టు ఆదేశించింది. అయితే నేడు హైకోర్టు తాజా తీర్పు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసినట్లయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: