గత నెలలో బ్యాంక్ ఉద్యోగులు సమ్మె చేస్తారని అనుకున్నారు.  కానీ, సమ్మెకు దిగలేదు.  సమ్మె చేస్తే దానివలన దాదాపు ఆరేడు రోజులపాటు బ్యాంకులు వరసగా మూతపడేవి.  దాంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారు.  27 బ్యాంకులగా వంటిని విలీనం చేస్తే దేశంలో ప్రభుత్వరంగ బ్యాంకులు 12 కు తగ్గిపోతాయి.  ఫలితంగా చాలావరకు బ్యాంకు కున్న లోటు తగ్గిపోతుంది.  అయితే, లోటు తగ్గిపోవడం మాట అటుంచితే.. బ్యాంకుల బ్రాంచ్ లు పెరిగిపోవడం, ఉద్యోగుల సంఖ్య అధికంగా ఉండటం వంటి వాటిని ఆసరాగా చేసుకొని ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటూ వస్తుంది.    


ఇలా క్రమంగా సంఖ్యను తగ్గిచడం వలన ఉద్యోగులు ఇబ్బందుల్లో పడిపోతారు.  దీనిని ముందుగానే గ్రహించిన ఉద్యోగులు సమ్మె చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  అయితే, ప్రభుత్వం మాత్రం బ్యాంకులను మెర్జ్ చేసినా.. ఒక్క ఉద్యోగం కూడా పోదని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.  కేవలం బ్యాంకులకు సంబంధించిన అప్పులు తగ్గించుకోవడం కోసమే ఇలా చేస్తున్నట్టు కేంద్రం చెప్తున్నది.  


విలీన ప్రక్రియ ప్రైవేటీకరణకు దారితీస్తుందనే విషయాన్ని తాము అర్థం చేసుకోగలమని, అందుకే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా  తెలిపింది. అందుకే అక్టోబర్ 22న సమ్మెకు దిగుతున్నామని పేర్కొంది. ఈ సమ్మెకు ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా  సమ్మెకు మద్దతు తెలిపింది.  


ఒకవేళ అక్టోబర్ 22 వ తేదీన సమ్మెకు దిగితే.. దాదాపు ఈ సమ్మెలో రెండు లక్షలమంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటారు.  చాలా బ్యాంకుల్లో ఆరోజు నగదు బదిలీ జరగదు.  ఫలితంగా చాలా నష్టం వస్తుంది.  అయితే ఎస్బిఐ మాత్రం యూనియన్లో తమ ఉద్యోగులు తక్కువ సంఖ్యలో ఉన్నారని, సమ్మె వలన ఎస్బిఐకు నష్టం ఉండబోదని అంటోంది.  మరి నిజంగానే ఆరోజున సమ్మె చేస్తారా లేదంటే గతంలో మాదిరిగానే చివరకు రాగానే సమ్మెను పోస్ట్ ఫోన్ చేసుకుంటారా చూడాలి.   


మరింత సమాచారం తెలుసుకోండి: