పండుగ సీజన్ వచ్చింది అంటే.. దూరప్రయాణాలు చేయాలి అనుకునేవారు పాపం రైల్వే టికెట్స్ దొరక్క నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు రైల్వేశాఖ ఓ శుభవార్తను తీసుకొచ్చింది.  దీని వలన ముగ్గురుకి ప్రయోజనం కలుగుతుంది.  ఆ శుభవార్త ఏంటి.. ఆ ముగ్గురు ఎవరు తెలుసుకుందాం.  


మాములుగా ట్రైన్స్ లో రెండు పవర్ జనరేటర్లు ఉంటాయి.  వీటి నుంచి ఫ్యాన్స్, లైట్స్, మొబైల్ ఛార్జింగ్ వగైరా వాటికీ పవర్ సప్లై అవుతుంది.  రెండు పవర్ జనరేటర్ల కారణంగా ఎక్కువ స్పేస్ ఆక్రమిస్తుంది.  అందుకోసం ఇకపై ట్రైన్స్ లో ఈ రెండు జనరేటర్లను తీసేయబోతున్నారు.  తీసేస్తే ఎలా ఫ్యాన్లు, లైట్లు ఉండగా అని షాక్ అవ్వకండి.  ఉంటాయి.  


కాకపోతే ఆ జనరేటర్లను వేరే చోట ఏర్పాటు చేయబోతున్నారు.  ఫలితంగా చాల వర్కౌ స్పేస్ మిగులుతుంది.  ఈ స్పేస్ లో అదనపు సీట్లు ఏర్పాటు చేస్తున్నారట.  రాజధాని ఎక్స్‌ ప్రెస్, శతాబ్ది ఎక్స్‌ ప్రెస్, డురొంటో ఎక్స్‌ ప్రెస్, సంపర్క్ క్రాంతి, హంసఫర్ ఎక్స్‌ ప్రెస్ వంటి వాటిల్లో అందుబాటులోకి వచ్చింది.  మిగతా వాటిల్లో కూడా వీటిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.  


ఇది నిజంగా శుభవార్తే అని చెప్పాలి.  ఎందులకంటే, అదనపు సీట్లు ఉండటం వలన బెర్ట్ కన్ఫర్మ్ అవుతుంది.  రైల్వేకు ఆదాయం వస్తుంది.  అలానే ప్రయాణికులు హ్యాపీగా ఫీలవుతారు.  అంతేకాదు రైల్వేకు డీజిల్ కూడా ఆదా అవుతుంది.  టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చిన తరువాత ప్రయాసలేకుండా సుఖమైనా ప్రయాణాలు చేస్తున్నారు.  అలానే ప్రయాణ సౌకర్యాలు కల్పించే వ్యవస్థలు కూడా మంచి లాభాలు పొందుతున్నాయి.  ఇప్పటికే నార్తన్ రైల్వే జోన్‌ లో పలు ట్రైన్ల లో ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పుడు వీటిని సౌత్ జోన్ లో కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.  త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: