ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి  సీఎంగా వైసీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకొని  5 నెలలు అయినది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయ అధికారుల్ని మార్చారు, పోస్టుల్లో కొత్త వారిని నియమించారు వైయస్ జగన్. ఏపీ డీజీపీగా ఉన్న ఆర్ పి ఠాకూర్ కి  బదులుగా గౌతమ్ సవాంగ్ ను నియమించారు. ఇతర ప్రాధాన్య పోస్టులలో కూడా కొత్త  అధికారులకు  బాధ్యతలు అప్పగించారు జగన్.

ఐపీఎస్ అధికారుల బదిలీలు ఇప్పటి వరకూ మూడు నాలుగు సార్లు జరిగాయి. కానీ ప్రభుత్వంలో కీలకమైన ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా మాత్రం ఇంకా ఎవరినీ నియమించలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా  ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను గా నియమించాలని సీఎం జగన్ అనుకున్నారు. అప్పటికే తెలంగాణ కేడర్ లో  స్టీఫెన్ రవీంద్ర విధులు నిర్వహిస్తున్నారు. స్టీఫెన్ రవీంద్రను  డిప్యూటేషన్ కు తెలంగాణ సర్కారు కూడా అనుమతినిచ్చింది.గౌరవం కోసం కేంద్రాన్ని కూడా జగన్ లేఖల మీద లేఖలు రాశారు, అయితే స్టీపెన్ డిప్యూటేషన్ కు కేంద్ర హోంశాఖ  మాత్రం అంగీకారం తెలపలేదు.

అప్పట్లో మూడు నెలలు సెలవు పెట్టిన స్టీఫెన్ ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా చేరిపోతున్నారు అని అందరు భావించారు. అంతా ఖాయం అని అనుకున్నప్పటికీ, కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆయన తిరిగి తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో తనకు కేటాయించిన పోస్టులో  తిరిగి చేరిపోయారు.  స్టీఫెన్ రవీంద్ర రాకపోవడంతో నిఘా విభాగాధిపతిగా కీలకమైన పోస్టుకు పలువురి పేర్లను సీఎం జగన్ పరిశీలించినప్పటికీ ఇంకా ఎవరిని నియమించలేదు జగన్.. రవాణా శాఖ కమిషనర్ గా ఉన్న ఆంజనేయలతో పాటు ఇతర ఐపీఎస్ అధికారుల బయోడేటాలూ జగన్ దగ్గరకి  వెళ్లాయి. అయితే ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఎవరికీ ఓకే చెప్పలేదు.

ప్రభుత్వానికి చెవులు కళ్లుగా పని చేసే ఇంటెలిజెన్స్ విభాగం  ను జగన్ ఎందుకు నియమించడం లేదనేది కొంత  సస్పెన్స్ ను గురిచేస్తుంది.. ఆరునెలలుగా ఈ పోస్ట్ కు సమర్థవంతమైన అధికారి దొరకడం లేదా లేక కావాలనే ఖాళీగా ఉంచుతున్నారా అనేది తెలియాల్సి ఉంది. స్టీఫెన్ రవీంద్ర కోసం మళ్లీ కేంద్రస్థాయిలో మరోసారి ప్రయత్నాలు చేస్తారా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: