ఆరోగ్యశ్రీ, ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో అమరావతిలో నిర్వహించిన ఈ సమీక్షలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్ ఒకటి నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో ఆరోగ్యశ్రీ సేవలు అందించాలని సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు. 150 ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు సీఎం నిర్ణయం తీసుకున్నారు.

 

 

డిసెంబర్ 1 నుంచి శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి కోలుకునే వరకు ఆర్థికసాయం అందించనున్నారు. కిడ్ని వ్యాధి గ్రస్తులతో పాటు తలసేమియా, హీమోఫిలియా, సికిల్‍సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతున్న వారికి రూ.10 వేల సాయం. రూ.5 వేల కేటగిరిలో మరో నాలుగు వ్యాధులు చేర్చాలని నిర్ణయించారు. పక్షవాతం, కండరాల క్షీణత, కాళ్ళు చేతులు లేనివారికి ఇకపై రూ.5 వేల పెన్షన్ అందనుంది. జనవరి 1 నుంచి ఈ పెన్షన్ అందించాలని ఆదేశించారు. జనవరి 1 నుంచి పశ్చిమగోదావరి జిల్లాలో 2వేల వ్యాధులకు, మిగిలిన జిల్లాల్లో 1200 వ్యాధులకు ఆరోగ్యశ్రీ పైలట్ ప్రాజెక్ట్ కింద అమలుచేయాలని నిర్ణయించారు. డెంగ్యూ, సీజనల్ వ్యాధులకు ఆరోగ్యశ్రీ పథకం వర్తింపు కానుంది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సంధర్భంగా సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు 2020 డిసెంబర్ నాటికి పూర్తికావాలని, బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా, నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. డిసెంబర్ 21 నుంచి ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు.

 

 

గిరిజన ప్రాంతాల్లో బైకుల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం సూచించారు. బోధనాస్పత్రుల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రణాళిక సిద్ధం సిద్ధం చేయాలని, వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీ ప్రక్రియ జనవరిలో మొదలు పెట్టాలని ఈ సమీక్షలో సీఎం వైఎస్ జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: