ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో తక్షణం చర్చలు జరపాల్సిందేనని చెప్పిందని 28వ తేదీ లోపు చర్చలు ముగించి 28వ తేదీ విచారణ జరిగేలోపు చర్చల సారాంశాన్ని కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి, ఆర్టీసీ ఎండీ, కార్మిక యూనియన్లకు ఆదేశాలు జారీ చేసిందని అడ్వకేట్ తెలిపారు. అడ్వకేట్ మాట్లాడుతూ ఆర్టీసీ ఎండీని మేం నియమించుకోలేమని అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ఆర్థిక దయనీయ పరిస్థితిని కోర్టు ముందు ఉంచటం జరిగిందని కార్మికుల సమస్యలు పరిష్కరించటానికి అభ్యంతరం ఏమిటని కోర్టు ప్రశించిందని అడ్వకేట్ తెలిపారు. 
 
మందుల కొరత గురించి, ఆసరా పెన్షన్ల గురించి, స్పేర్ పార్ట్స్ గురించి, దుస్తుల గురించి హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించిందని అడ్వకేట్ తెలిపారు. ప్రజల బాధను, ప్రజల ఇబ్బందులను అందరు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసిందని అడ్వకేట్ తెలిపారు. హైకోర్టు ప్రభుత్వం విషయంలో ఒకింత ఘాటుగానే స్పందించిందని తెలుస్తోంది. న్యాయస్థానం ప్రజలు శక్తిమంతులని ప్రజలు తిరగబడితే ఎవరూ ఆపలేరని వ్యాఖ్యలు చేసింది. 
 
ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండు వారాలుగా జరుగుతోంటే ఎందుకు ఆపలేదని కోర్టు ప్రశ్నించింది. హైకోర్టు కార్మికుల డిమాండ్లలో ఎక్కువ డిమాండ్లు పరిష్కరించటానికి సాధ్యం అయ్యేవే అని కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు ఇవ్వటానికి ప్రభుత్వానికి ఇబ్బంది ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల కంటే ఎవరూ గొప్ప కాదని ప్రజలే ప్రజాస్వామ్యమని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. 
 
హైకోర్టు ఫిలిప్ఫీన్స్ రాజు విషయంలో ప్రజల తిరుగుబాటును ఈ సందర్భంగా గుర్తు చేసింది. పాఠశాలల ప్రారంభం గురించి కూడా హైకోర్టు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. రేపు ఉదయం 10 : 30 గంటలకు ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరపాలని న్యాయస్థానం ప్రభుత్వానికి సూచనలు చేసింది. మరి హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి ఆర్టీసీ కార్మికుల కొన్ని డిమాండ్లనైనా నెరవేర్చి సమ్మెకు ముగింపు పలుకుతుందేమో చూడాలి. 




మరింత సమాచారం తెలుసుకోండి: