నేటి కాలం ప్రజలు బద్ధకం ఎక్కువైపోయి కనీసం వారికి అవసరమైన వస్తువులను అంగళ్ల వర కు వెళ్లి కొనుక్కునేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఏది కావాలన్నా ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు. తినే తిండి దగ్గర నుంచి కట్టుకునే గుడ్డ వరకు అన్నీ ఆన్లైన్లోనే ఇంటికి వచ్చేస్తున్నాయి మరి. ఇక ఈ దసరా దీపావళి సంక్రాంతి పండగ సీజన్లలో అయితే వారు ఇచ్చే ఆఫర్లకు మోజుపడి మన వారంతా తమ చేతి వేళ్లకు తెగ పని చెప్పేస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికే ఈ వార్త.

తాజాగా మోడీ తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలో ప్లాస్టిక్ కవర్లు వినియోగం భారీగానే తగ్గిందని చెప్పాలి. కనీసం చోటామోటా దుకాణాల్లో కూడా ప్లాస్టిక్ అనేది గత కొద్ది రోజులుగా కనిపించడం లేదు. కానీ ఎవరికీ కనపడకుండా మట్టి రంగు అట్టపెట్టెలో ఆన్లైన్లో ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లేదా ఇతర వెబ్సైట్ల నుంచి వెళ్తున్న వస్తువులు చుట్టూ ఉన్న ప్లాస్టిక్ కవర్ల సంగతి ఏమిటి? అది మాత్రం ప్లాస్టిక్ కాదా? మీరు గమనించినట్లయితే ఆన్లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ పెడితే చిన్న చిన్న బుడగలు ఉండే ప్లాస్టిక్ కవర్ ను ఆ వస్తువుకి రక్షణగా ఉంచుతారు. వాటిని సరదాగా చిన్నపిల్లలు పగలగొడుతుంటారు కూడా. వాటిని ఒక చోటు నుండి ఇంకొక చోటుకి తరలించేటప్పుడు వస్తువులు లోనయ్యే కుదుపులకు ఎలాంటి డ్యామేజి జరగకుండా వాడుతారు.

ఢిల్లీలోని 11వ తరగతి చదివే ఒక పిల్లవాడు ఈ కామర్స్ మహామహులకే పెద్ద తలనొప్పుని తెచ్చిపెట్టాడు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వారితో కలిసి ఢిల్లీలో అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వారు అధికంగా ఈ బుడగలు ఉండేటటువంటి మెటీరియల్ ను తాము ఆర్డర్లు సప్లై చేసే డబ్బాల్లో ఎక్కువగా వాడుతున్నారని పిటిషన్ వేశాడు. దీంతో భారతదేశ గవర్నమెంటు అమెజాన్, ఫ్లిప్ కార్టు వారికి అందులో ఉపయోగించే ప్లాస్టిక్ మొత్తాన్ని నిషేధించాలని ఆర్డర్లు జారీ చేసింది. కాబట్టి ఇకపై మీరు ఆన్లైన్లో గాజు వస్తువులు లేదా ఏదైనా సున్నితమైన వస్తువులు ఆర్డరు పెట్టాలంటే ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: