గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో హాట్ టాపిక్ గా మారిపోయారు.  మొన్న ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓడిపోయారు. అయితే ఓటమి పాలైన దగ్గర నుంచి దగ్గుబాటి సైలెంట్ గా ఉండిపోయారు. ఈ సమయంలోనే అధినేత జగన్....ఎన్నికల ముందు టీడీపీలోకి వెళ్ళిపోయిన రావి రామనాథం బాబుని మళ్ళీ పార్టీలోకి తీసుకొచ్చారు. ఇక్కడ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కీలక పాత్ర పోషించి రావిని పార్టీలోకి తీసుకొచ్చారు.


అలాగే ఆయనకు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్ష పదవి కేటాయించారు. పరోక్షంగా పర్చూరు బాధ్యతలను చూసేకోవాలనే సంకేతాలను ఇచ్చినట్లుగా పార్టీలో ప్రచారం సాగింది. ఈ క్రమంలోనే గత వారం క్రితం దగ్గుబాటి సీఎం జగన్ ని కలిసినట్లు తెలిసింది. అయితే ఈ సందర్భంగా జగన్ బీజేపీలో ఉన్న పురందేశ్వరిని కూడా పార్టీలోకి తీసుకు రావాలని కోరారని, ఇద్దరు ఒకే పార్టీలో ఉంటే బాగుంటుందని జగన్ దగ్గుబాటికి సూచించారని సమాచారం. అలాగే ఈ మీటింగులో మరొక విషయం కూడా చర్చకు వచ్చిందని తెలిసింది.


పురందేశ్వరి వైసీపీలోకి వస్తే రాజ్యసభ ఇస్తానని కూడా జగన్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే పురందేశ్వరిని అడిగి నిర్ణయం చెబుతానని దగ్గుబాటి…జగన్ కు చెప్పి వచ్చారని తెలిసింది. ఇక ప్రస్తుతం పురందేశ్వరి అమెరికాలో ఉన్నారు. ఆమె తిరిగి రాగానే దగ్గుబాటి జగన్ ప్రతిపాదనని చెప్పనున్నారు. దీనికి పురందేశ్వరి ఒప్పుకుంటే ఓకే లేదంటే దగ్గుబాటి కూడా వైసీపీలో ఉండే విషయం గురించి ఆలోచించుకోవాలి.


అయితే దగ్గుబాటి తన నిర్ణయాన్ని చెప్పడానికి ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. జగన్ కూడా వారి నిర్ణయం కోసం ఇంకా వేచి చూడాలనే అనుకుంటున్నారు. ఎందుకంటే వీరు ఎన్టీఆర్ ఫ్యామిలీ కావడం, పైగా వారి సామాజికవర్గం మద్ధతు మరింతగా దక్కుంతుందని జగన్ భావిస్తున్నారు. అందుకే దగ్గుబాటి ఫ్యామిలీని తొందరగా వదులుకోవడానికి జగన్ సిద్ధంగా లేరు. మ‌రి ద‌గ్గుపాటి ఫ్యామిలీ డెసిష‌న్ ఎలా ఉంటుందో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: