తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జుట్టు హుజూర్ నగర్ ప్రజల చేతికి  చిక్కిందని ... వదిలితే మళ్ళీ అయన జుట్టు మీ చేతికి  దొరకరని టీ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు . పాలకిడు లో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి తరపున రేవంత్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు . ఈ సందర్బంగా కేసీఆర్ పై  రేవంత్  ఒంటికాలితో లేచాడు . కేసీఆర్ కు ముఖం చెల్లకనే హుజూర్ నగర్ సభ ను రద్దు చేసుకున్నారని అన్నారు .


 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు కాబట్టే ... హుజూర్ నగర్ వచ్చేందుకు కేసీఆర్ కు ముఖం చెల్లలేదని అన్నారు . చిన్నపాటి వర్షానికే సభ రద్దు చేసుకున్నట్లు చెప్పారని  కానీ  ఆర్టీసీ కార్మికులు బుద్ది చెబుతారని భయంతోనే సభ రద్దు చేసుకున్నారని చెప్పారు . హుజూర్ నగర్ ఉప ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఎన్నికని అభివర్ణించిన రేవంత్ , తెలంగాణలో ప్రస్తుతం ఆత్మగౌరవం తో బ్రతికే పరిస్థితి లేదంటూ ఎద్దేవా చేశారు . హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అధికార టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీలు నువ్వా -నేనా  అన్నట్లు తలపడుతున్నాయి .


 ప్రచారానికి మరొక రోజు వ్యవధి మాత్రమే మిగిలి ఉన్న నేపధ్యం లో  ప్రధాన పార్టీల కీలక నేతలు హుజూర్ నగర్ లో మోహరించి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు . హుజూర్ నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడే నాటికీ , ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో తేడా కన్పిస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు . ఆర్టీసీ సమ్మె నేపధ్యం లో అధికార పార్టీ కి ఎదురుగాలి వీస్తోందని చెబుతున్నారు . ఈ పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: