పోలీస్ ఉద్యోగం అంటేనే 24 గంటల డ్యూటీ.. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వచ్చినా మళ్లీ ఎప్పుడు వెళ్లాలో తెలియదు. సెలవులు, పండుగలు, పబ్బా అనేవి ప్రత్యేకంగా ఉండవు. ఇక ఏదైనా శాంతిభద్రతల సమస్యలు ఉన్నప్పుడు డ్యూటీ కత్తి మీద సామే. పోలీసులే లేకుండా సమాజం ఇంత ప్రశాంతంగా ఉండే అవకాశమే లేదు.


కానీ ఆలాంటి పోలీసుల జీవితాల్లో మాత్రం వినోదం కరవవుతోంది. పెళ్లాంబిడ్డలతో కనీసం ఒక్క రోజైనా ప్రశాంతంగా ఉండే వీలు లేకుండా ఉంది. కానీ ఇప్పుడు ఆ అవకాశం జగన్ సర్కారు కల్పిస్తోంది. పోలీసులకు వీక్లీ ఆఫ్ లు జగన్ సర్కారు వచ్చాక అమలవుతున్నాయి. ఇప్పుడు పోలీసు కుటుంబాలు జగన్ పేరు చెప్పుకుని ఆనందంగా గడుపుతున్నారు.


పోలీసుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలిసారిగా పోలీసులకు వీక్లీఆఫ్‌లు ప్రకటించారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా గుడివాడలోని డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమంలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ రవీంద్ర బాబు ఆధ్వర్యంలో గుడివాడ పోలీసులు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహించటం సంతోషకరమన్నారు.


పోలీసు అధికారులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ వారోత్సవాల్లో రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. సమాజానికి ఏదొక మేలు చేయాలన్న పోలీసు శాఖ సంకల్పం అభినందనీయమన్నారు. పోలీసులు వారి కుటుంబాలను సైతం వదిలి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే శాఖ పోలీసు శాఖ.. ప్రతి ఏడాది పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని ద్వారా అమరులైన పోలీస్‌ సిబ్బందిని గుర్తు చేసుకోవడం నిజమైన నివాళి అన్నారు. విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాలను ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమం ద్వారా ఆయుధాలు గురించి తెలియజేయడం మంచి పరిణామం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: