నేడు ఆర్టీసీ జేఏసీ తెలంగాణ బంద్ నిర్వహించేందుకు పిలుపునిచ్చారు. గత 14 రోజుల నుండి వివిధ రకాలుగా నిరసన తెలుపుతూ నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ . అయితే ఈ నెల  5 న ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె నేటితో 15వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ సమ్మె పై ఇప్పటివరకు కేసీఆర్ మాత్రం స్పందించలేదు. సమ్మె చేస్తున్న 50 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులు అందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓ వైపు ఆర్టీసీ కార్మికులు ఆత్మబలిదానాలు చేసినప్పటికీ కూడా కేసీఆర్ సమ్మెపై స్పందించలేదు. అంతే కాకుండా  ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాగా దీనిపై నిన్న హైకోర్టులో విచారణ జరపగా... నేడు 10 గంటల 30 నిమిషాలకు ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి  సూచించింది హైకోర్టు. అయితే తాము చర్చలకు సిద్ధమే అని ఆర్టీసీ యూనియన్ తెలపగా  ఈ నిర్ణయం తీసుకుంది హైకోర్టు. 

 

 

 

 అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది  ప్రభుత్వం. అదే ప్రైవేటు బస్సులను ప్రయాణికుల సౌకర్యార్థం నడిపిస్తుంది. అయితే ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు కూడా ప్రయాణికుల అవసరాలను పూర్తి స్థాయిలో తీర్చడం లేదు. కాగా ఓ వైపు ఆర్టీసీ సమ్మెతో రాష్ట్రంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. కాగా ఆర్టీసీ సమ్మె కు ఇప్పటికే  ప్రతిపక్ష పార్టీలైన  బిజెపి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం లు  మద్దతు తెలిపాయి. దీంతో రాష్ట్రంలో సమ్మె రోజు రోజుకు ఉధృతమవుతోంది . ఇదిలా ఉండగా నేడు తెలంగాణ బంద్ నిర్వహిస్తుంది ఆర్టీసీ జేఏసీ . తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి బస్సులు గానీ టాక్సీలు నడవడానికి వీలు లేకుండా తెలంగాణ బంద్  నిర్వహిస్తుంది. 

 

 

 

 అయితే నేడు తెలంగాణ లో బందు నిర్వహించేందుకు ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. కాగా నేడు తెలంగాణ బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు యదా తదంగా  నడపాలని బంద్ ప్రభావం ఎక్కడ కనిపించకూడదు అని కేసీఆర్ తేల్చి చెప్పారు. అయితే రోజులాగే ప్రయాణికులకు పూర్తిస్థాయిలో సేవలందించి ప్రయాణికులకు  ఇబ్బందులు కలగకుండా  చూడాలన్నారు ... బస్సులు నడవకుండా ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠినంగా వ్యవహరించాలని కెసిఆర్ అంతర్గతంగా ఆదేశించినట్లు సమాచారం. తెలంగాణ బంద్ నేపథ్యంలో  బస్ డిపోల వద్ద భద్రత, రాష్ట్రంలో నడిపే బస్సులన్నిటికి  రక్షణ, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లను దృష్టి సాధించాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కాగా నేడు తెలంగాణ బంద్ నేపథ్యంలో రాష్ట్రంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: