తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి వచ్చిన ఆదేశం వరుసగా రెండోసారి షాక్ ఇచ్చింది. రానున్న మూడు రోజుల్లో కచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగుల యూనియన్ ప్రెసిడెంట్ తో ప్రభుత్వం చర్చలు జరిపి తమ చివరి నిర్ణయాన్ని అక్టోబర్ 28వ తేదీన కోర్టు ముందు తెలియజేయాలని తేల్చి చెప్పింది. మనందరికీ కెసిఆర్ కు ఎంత ఇగో ఉందో తెలిసిందే. దాని కారణంగానే ఆర్టీసీ కార్మికుల మాస్ సస్పెన్షన్ ను విధించారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళ విషయంలో తగ్గితే రేపు వేరే కార్మిక సంఘాలు తమ డిమాండ్లు కచ్చితంగా పూర్తి చేయాలని వీలు చిక్కినప్పుడల్లా ప్రభుత్వం మెడలు వంచి పరిస్థితి వస్తుంది. ఏదో ఒకరిద్దరి స్వార్థ ప్రయోజనాల కోసం మొత్తం రాష్ట్ర ప్రజలను ఊబి లోనికి నెట్టేయకూడదు అన్నది కేసీఆర్ వాదన.

ఇది ఎలా ఉన్నా ప్రస్తుతం కెసిఆర్ తీసుకోబోయే నిర్ణయం మాత్రం ఇటు హైకోర్టుతో పాటు అటు ప్రతిపక్ష నాయకులకూ పెద్ద తలనొప్పులు తెచ్చేలాగా ఉంది. భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి అయిన కృష్ణ సాగర్ రావు శుక్రవారం మాట్లాడుతూ హైకోర్టు ఆర్డర్ చేసిన విధంగా తక్షణమే ప్రభుత్వం ఆర్టీసీ సంఘాలతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే తమ పూర్తిస్థాయి మద్దతును బీజేపీ ఆర్టీసీ సంఘాలకు ప్రకటించగా రావు గారు మరీ ముఖ్యంగా కెసిఆరే ఆర్టీసీ కార్మికుల యూనియన్ల వారితో మాట్లాడాలని... అంతేగాని పరిపాలన అధికారులతో లేదా మరి ఇంకెవరైనా పవర్ లేని వారితో మాట్లాడించి నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని ఆయన అన్నారు. 

ఇక్కడ రావు భయపడుతుంది ఏమిటంటే కెసిఆర్ ఉన్న మూడు రోజులు గడువు లో పరిపాలన అధికారులతో మాట్లాడించి తాము నివేదిక తయారు చేస్తున్నామని దీనిపై ఇంకా చర్చించాల్సి ఉందని ఏ ఒక మాటలు చెప్పి 28వ తేదీన మరింత గడువు అడిగి ఆర్టీసీ సమ్మె యొక్క తీవ్రతను తగ్గించే అవకాశాలు ఉన్నాయని భయపడుతున్నారు. అందుకే తెలంగాణ పార్టీ కాంగ్రెస్ కమిటీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి కూడా హైకోర్టు చెప్పిన విధంగా ముఖ్యమంత్రే నేరుగా వ్యవహరించాలని పదే పదే చెబుతున్నాడు. గతంలో కూడా హైకోర్టు ఆదేశాలను ధిక్కరించిన కెసిఆర్ ఇప్పుడు ఏదో ఒక ఎత్తు వేసి దీనిని ఆపగలిగితే.... తర్వాత వారి భవిష్యత్తు కార్యాచరణకు కొంచెం కూడా స్కోప్ ఉండదని వారి బాధ.


మరింత సమాచారం తెలుసుకోండి: