గత 14 రోజులుగా తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రోజు రోజుకు మద్దతును  కూడగట్టుకుని సమ్మె ఉధృతం అవుతూనే ఉంది. కాగా ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మికుల సమ్మె పై కేసీఆర్ మాత్రం  స్పందించిన దాఖలాలు లేవు. అయితే గత 14 రోజులుగా వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్నప్పటికీ...  కేసీఆర్ స్పందించకపోవడంతో ఆర్టీసీ కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు ఆర్టీసీ కార్మికులు. అయితే ఆర్టీసీ సమ్మె ఎఫెక్టుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అప్పటికి... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి పెడుతున్నారు తప్ప ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల పరిష్కారం  పై దృష్టి పెట్టడం లేదు. 

 

 

 

 

 అయితే నిన్న ఆర్టీసీ సమ్మె పై విచారణ జరిపిన హైకోర్టు... అటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు...ఇటు  ఆర్టీసీ యూనియన్ల వాదనలు విన్న తర్వాత... ఆర్టీసీ యూనియన్లు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమని తెలపడంతో... ఆర్టీసీ యూనియన్ లతో ఈరోజు 10 గంటల 30 నిమిషాలకు చర్చలు జరపాలని ప్రభుత్వానికి ఆదేశించింది. అయితే హైకోర్టు తీర్పును కెసిఆర్ లైట్  తీసుకున్నట్లు వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ చర్చలు జరిపే  ఉద్దేశం  ఉంటే ఇప్పటికే కార్మిక సంఘాల నేతలకు సంకేతాలు వెళ్లి ఉండాల్సిందని... కానీ  అలాంటిదేమీ జరగలేదని తెలుస్తోంది. 

 

 

 

 

 అయితే ఇప్పుడు వరకు హైకోర్టు  ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం తప్పితే... ఎలాంటి ఆదేశాలు ఇవ్వక పోవడం కెసిఆర్ కోర్టు సూచనలను  లైట్ తీసుకుని పెద్దగా పట్టించుకోవడం లేదని ప్రచారం కూడా జరుగుతోంది.కాగా  ఆర్టీసీ సమ్మె పై తదుపరి విచారణను కోర్టు పది రోజులకు వాయిదా వేయడంతో మరో పది రోజులు ఏ నిర్ణయం తీసుకోకపోయినా ఏం కాదన్న  ధోరణిలో కేసీఆర్ ఉన్నాడని ఊహాగానాలు కూడా వస్తున్నాయి. ఇదిలా ఉండగా నేడు తెలంగాణ బంద్ నిర్వహించేందుకు  ఆర్టీసీ యూనియన్ అని పిలుపునిచ్చారు. నేడు తెల్లవారుజాము నుంచే తెలంగాణ బంద్  నిర్వహిస్తున్నారు ఆర్టీసీ జేఏసీ. కాగా  బంద్ తొ రాష్ట్రంలో అక్కడక్కడ  ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అయితే ఓ వైపు కేసీఆర్ కూడా తెలంగాణ బంద్ నిర్వహించేదీ లేదంటూ బస్సులు నడపాలని అధికారులను ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: