పాక్ ప్రధాని ఇమ్రాన్ గౌరవం ప్రపంచంలో రోజు రోజు దిగజారిపోతోంది.  ప్రపంచంలో ఉన్నత దేశంగా తీర్చిదిద్దుతానని, చుట్టుపక్కల దేశాలతో సఖ్యతను నడుపుతానని చెప్పిన ఇమ్రాన్, తరువాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు.  దేశంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన ఇమ్రాన్, గతంలో కంటే పరిస్థితులను దారుణంగా తీసుకెళ్తున్నారు. ఉద్యోగాల కొరత దేశంలో తీవ్రం అవుతున్నది.  అంతర్జాతీయంగా డాలరుతో పాక్ రూపాయి విలువ దారుణంగా పడిపోతుంది.  చుట్టుపక్కల ఉన్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి సూచికలో పాక్ దారుణంగా పడిపోయింది.  చైనాతో సహకారం ఉన్నా ఆదేశానికి పెద్దగా ఉపయోగపడటం లేదు.  


ఇక ఇదిలా ఉంటె, ఇమ్రాన్ ఖాన్ అంతర్జాతీయ వేదికలపై కేవలం కాశ్మీర్ అంశాన్ని మాత్రమే ఎక్కువగా ప్రస్తావిస్తూ దేశంలోని విషయాలను గాలికొదిలేస్తున్నాడు.  ఇలా గాలికి వదిలేయడం వలన జరుగుతున్న నష్టాలు అన్ని ఇన్ని కాదు.  మరోవైపు ఎఫ్ఏటిఎఫ్ ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది.  ఉగ్రవాదులను ఏరివేయకపోతే.. బ్లాక్ లిస్టులో ఉంచుతామని చెప్పింది.  దానికి ఫిబ్రవరి వరకు సమయం ఇచ్చింది.  ఈ ఆరు నెలల కాలంలో దీనిపై తీసుకునే నిర్ణయం బట్టి పాక్ పరిస్థితి ఆధారపడి ఉంటుంది.  


వీటి గురించి పాకిస్తాన్ పట్టించుకోదు.  ఆ దేశానికీ కావాల్సింది ఇండియాతో శతృత్వం.  ఇండియాను నిత్యం ఏదొక రూపంలో ఇరుకున పెట్టాలని అనుకోవడం.. అంతే.. వీటికోసమే ఆ దేశం పనిచేస్తుంది.  వీటిని అమలు చేయడానికి అవసరమైతే ఉగ్రవాదులను ఇండియాలోకి పంపేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది.  అది జరిగే వరకు ఖాళీగా ఉండదు.  అందుకే ఎలాగైనా ఇండియాలోకి ఉగ్రవాదులను పంపించి అలజడులు సృష్టించాలని చూస్తున్నది.  


అయితే, అంతర్జాతీయ వేదికలపై ముఖ్యంగా ఇటీవల జరిగిన ఐరాస సమావేశాల్లో ఎక్కువ సమయం మాట్లాడిన వ్యక్తిగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నిలిచారు.  అయన 50 నిమిషాలపాటు ప్రసంగించారు.  మాములుగా 190 దేశాలు భాగస్వామ్యం ఉన్న సభలో ప్రతి ప్రతినిధికి 15 నిమిషాల సమయం ఇస్తారు.  కానీ, ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా 50 నిమిషాలపాటు మాట్లాడారు.  అందులో 70శాతం కాశ్మీర్ అంశం గురించి, ఇండియా అరాచకాల గురించి మాత్రమే ఉన్నది.  ఈ ప్రసంగం మొత్తం ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టింది.  ఉపయోగం లేకుండా ఎంతసేపు ప్రసంగం చేస్తే ఉపయోగం ఏముంటుంది.  అంతేకాదు, గతంలో గడాఫీ కూడా ఐరాసలో 90 నిముషాలు మాట్లాడారు.  అదే ఇప్పటి వరకు రికార్డ్.  ఇప్పుడు గడాఫీ శకం అంతరించిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: