బిగ్ బాస్ సీజన్-3 మరొక రెండు వారాల్లో ముగియనుండగా గ్రాండ్ ఫైనల్ లో నిలిచే ఐదుగురు కంటెస్టెంట్స్ ఎవరు అనే విషయం పై ఇప్పటికే చర్చ మొదలయింది. ప్రస్తుతానికైతే ఇంటిలో వరుణ్ సందేశ్, శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్, బాబా భాస్కర్, శివ జ్యోతి, అలీ మరియు వితిక ఉన్నారు. మరో విశేషమేమిటంటే ఈ వారం నామినేషన్లలో మొత్తం ఏడుగురు ఉండడం. దీంతో రేపు ఒకరిని, వచ్చేవారం ఒకరిని ఎలిమినేట్ చేసేస్తే చివరివారం ఐదుగురు కంటెస్టెంట్స్ గ్రాండ్ ఫైనల్ లో లో టైటిల్ కోసం పోటీ పడతారు. కావున ఈ రోజు హౌస్ నుండి బయటకు వెళ్ళిపోయే వ్యక్తి ఎవరో తెలుసుకోవడానికి అభిమానులు అంతా కుతూహలంగా ఉన్నారు.

తాజాగా వచ్చిన రిపోర్టుల ప్రకారం ప్రజలు ఎక్కువగా రాహుల్, శ్రీముఖి, శివ జ్యోతి, బాబా భాస్కర్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. వరుణ్ సందేశ్ దాదాపుగా సేఫ్ పొజిషన్ అని చెప్పొచ్చు. ఇకపోతే మిగిలిన ఇద్దరు... అలీ మరియు వితికలలో ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారా అని ఆసక్తిగా ఉందా..? శుక్రవారం వరకు తక్కువ ఓట్లతో ఉన్న అలీ మరియు వితికలలో ప్రేక్షకులు శుక్రవారంనాడు అలీ వైపు మొగ్గు చూపారు. ఎంతలా అంటే అలీ.... వరుణ్ సందేశ్ ను కిందకు నెట్టి లిస్టులో పైకి వెళ్ళిపోయేంతగా.

కాబట్టి వరుసలో చివరన భార్యాభర్తల్లో ఒకరు రేపు ఎలిమినేట్ కాక తప్పేటట్లు లేదు. కచ్చితంగా వారిద్దరిలో వితక పైన ఉన్న నెగటివిటీ అంతా ఇంతా కాదు. కాబట్టి తాను ఈ వారం బయటికి వెళ్లిపోతుందని మనందరం ఒక నిర్ణయానికి వచ్చేయొచ్చు. ఇకపోతే వితిక దాదాపు ఇంట్లో ఉన్న అందరి గురించి వెనకాల మాట్లాడడం, వరుణ్ కి ఒక పెద్ద మైనస్ గా నిలబడడం కూడా ఆమె ఇంటికి బయటికి వెళ్లే కారణాలుగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా బిగ్ బాస్ టైటిల్ ఎవరిని వరిస్తుందో తెలుసుకోవాలంటే ఇంకొక రెండు వారాలు ఓపిక పడితే చాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: