యాపిల్ సీమ కాశ్మీర్ భారతావనికి నుదిటి తిలకం. అటువంటి కాశ్మీర్ మూడు దశాబ్దాలుగా అల్లకల్లోలంగా మారింది. మరి కాశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు  గత పాలకులు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అదే సమయంలో పాకిస్థాన్ రెచ్చిపోయి మరీ విషం కక్కుతూ వచ్చింది. ఇపుడు ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్ కు స్వేచ్చ ప్రసాదించామని మోడీ సర్కార్ భావిస్తోంది. మరి కాశ్మీర్లో రక్తపాతమేంటి...


అంటే ఇది దాయాది పాకిస్థాన్ కల అన్నమాట. కాశ్మీర్లో భయానక వాతావరణం ఉందని ఇప్పటికే ప్రపంచ దేశాలకు చెప్పి చాడీలు మోసిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. కాశ్మీర్లో ఆంక్షలు విధించి అక్కడ మానవహక్కులను ఉల్లంఘన చేస్తున్నారని భారత్ మీద దాడి చేస్తున్నారు.


ఎపుడైతే కాశ్మీర్లో ఆంక్షలు రద్దు చేశారో ఆనాడే రక్తపాతం జరుగుతుందని, కాశ్మీర్లో మారణహోమమే రగులుతుందని ఇమ్రాన్ భయపెట్టేస్తున్నాడు. తొమ్మిది లక్షల మంది సైనికులతో కాశ్మీర్ని పహరా కాస్తారా అది మీ వల్ల అవుతుందా అంటున్నాడు ఇమ్రాన్ ఖాన్. కాశ్మీర్ ని పూర్తిగా గుప్పిట పట్టాలని చూస్తున్న భారత్ ది దురంకారమని కూడా తిట్టిపోస్తున్నాడు.


మరి ఇంతలా రెచ్చిపోతున్న ఇమ్రాన్ ఖాన్ కాశ్మీర్ విషయంలో ఏం  చేస్తారు, రక్తపాతాన్ని కోరుతున్న దాయాది పాక్ ఉగ్రవాదాన్ని మళ్ళీ ఎగదోస్తోందా, పచ్చని నేల మీద చిచ్చు రాజేస్తోందా అన్నది ఇపుడు చర్చగా ఉంది. కాశ్మీర్లో గతంలో మాదిరిగా ఉగ్ర మూకలు ప్రవేశించి గొడవలు స్రుష్టించి భారీ రక్తపాతానికి స్కెచ్ వేశాయా. ఇమ్రాన్ మాటల్లో అర్ధమేంటి.ఇదీ ఇపుడు ప్రజాస్వామ్య ప్రియులలో మెదులుతున్న ప్రశ్న, భయం కూడా అదే. తాజాగా పాకిస్థాన్ బెదిరింపులతో భారత్ అప్రమత్తమవుతొంది. దాయాది దురాలోచనలను డేగకళ్ళతో గమనిస్తోంది. మరి పచ్చన్ కాశ్మీర్ ని పదిలపరచుకోగలమా..



మరింత సమాచారం తెలుసుకోండి: