ఆర్టీసీ కార్మికుల సమ్మె 15వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు తెలంగాణ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చాయి. సీఎం కేసీయార్ ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచే అవకాశం ఉందా? కేసీఆర్ కోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకొని చర్చలు జరుపుతారా? ప్రభుత్వం తరపు నుండి చర్చలు ఎవరు జరుపుతారు? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకటం లేదు. హైకోర్టు చర్చలు జరపాల్సిందేనని స్పష్టం చేయటంతో ప్రభుత్వం చర్చల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఆర్టీసీ కార్మిక సంఘాలు చర్చలకు సిద్ధమని గతంలోనే ప్రకటించాయి. ఆర్టీసీ జేఏసీ నాయకులు ప్రభుత్వం పిలిస్తే చర్చలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం, ఆర్టీసీ కార్మికుల మధ్య చర్చలు జరిగినా కార్మిక సంఘాలు పెట్టిన డిమాండ్లలో ప్రభుత్వం ఎన్ని డిమాండ్లకు అంగీకరిస్తుంది? ప్రభుత్వం కొన్ని డిమాండ్లకు మాత్రమే అంగీకరిస్తే ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒప్పుకుంటాయా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగినా చర్చల వలన పెద్దగా ఫలితం ఉండదనే టాక్ కూడా వినిపిస్తోంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడా అనే ఉత్కంఠ నెలకొంది. సీఎం కేసీఆర్ హైకోర్టు ఆదేశాలు పాటిస్తారా? లేదా? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరిష్కారం లభించటం అంత తేలిక కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
 
రేపటితో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు పూర్తవుతూ ఉండటంతో ప్రభుత్వం ఉపయోగిస్తున్న స్కూల్, కాలేజీ బస్సులు వెనక్కు ఇచ్చేయాల్సి ఉంది. ఇప్పటికే సమ్మె మొదలై రెండు వారాలు పూర్తి కావటంతో ప్రజలు సమ్మె వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.బంద్ నేపథ్యంలో చాలా ప్రాంతాలలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఇలాంటి పరిస్థితులలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: