ప్రతీ రాష్ట్రానికి ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది ఉంటుంది. కానీ అవతరణ దినోత్సవం జరుపుకోని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే. ఎందుకంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలంటే ఏ తేదీన జరుపుకోవాలో అర్థం కాని పరిస్థితి. 2014 జూన్ 2 న సమైక్య ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడ్డాయి. ప్రతీ ఏటా జూన్ 2 వ తేదీని తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని చాలా అట్టహాసంగా జరుపుకుంటారు.


అయితే అదే రోజు ఆంధ్రప్రదేశ్ కూడా ఏర్పడింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు తాము విడిపోవాలని కోరుకోలేదు కాబట్టి ఆ రోజుని అవతరణ దినోత్సవంగా జరుపుకోవట్లేదు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జూన్ 2 వతేదీన వేరే పేర్లతో హడావిడి చేసేవాడు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం గురించి చర్చకి వచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్ అవతరణ నవంబరు 1 న జరుపుకోవాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.


ఇక్కడే జగన్ తప్పు చేశాడని అందరూ భావిస్తున్నారు. ఎందుకంటే నవంబరు 1వ తేదీన సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. నిజాం పాలన నుండి విముక్తి పొందిన హైదరాబాదు రాష్ట్రం, అలాగే మద్రాసు నుండి విడివడిన ఆంధ్ర రాష్ట్రం కలిసి భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరిట నవంబరు  1వ తేదీన సమైక్య ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. ఇప్పుడు ఈ సమైక్య రాష్ట్రం విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.


కాబట్టి నవంబరు 1 వ తేదీకి అసలు ప్రాధాన్యతే లేదు. అయినా ఆ రోజున అవతరణ దినోత్సవం జరుపుకోవడాన్ని పాత్రికేయులు వ్యతిరేకిస్తున్నారు. అవతరణ దినోత్సవం జరుపుకోవాలంటే మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడివడ్డ అక్టోబర్ 1 వతేదీని జరుపుకోవాలని సూచిస్తున్నారు. పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ఫలితంగా కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1 వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అవతరించింది..


మరింత సమాచారం తెలుసుకోండి: