ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దాదాపుగా అయిదు నెలలుగా ఏపీని పాలిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఫుల్ బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఢిల్లీ టూర్లు కూడా వరసగా చేస్తూ వచ్చారు. జగన్ ఢిల్లీ వెళ్ళినపుడల్లా ప్రధాని మోడీ కూడా అపాయింట్మెంట్ ఇచ్చేస్తున్నారు. పైగా వెళ్ళిన ప్రతీసారీ గంటకు పైగా భేటీలు జరిగేవి. ఇక జగన్ కి మోడీ ఇస్తున్న ప్రాధాన్యత చూసిన వారు ఏపీని ఎక్కడో పెడతారని అనుకున్నారు.


సీన్ కట్ చేస్తే జగన్ కి ఢిల్లీ టూర్లు అచ్చిరావడంలేదు. పైగా జగన్ ఢిల్లీ వెళ్ళినపుడల్లా భారీ నిరాశ  తప్పించి జరిగినది ఏదీ లేదు. కేంద్ర సాయం చూసినా కనీసమాత్రంగా కూడా లేదు. మరో వైపు కేంద్ర బడ్జెట్లోనూ మొండి చేయి చూపించారు. ప్రత్యేక నిధులు లేవు. ప్రత్యేక హామీ వూసు అంతకంటే లేదు. ఇక జగన్ పదే పదే ఆదుకోవాలని విన్నపాలు చేసినా పట్టించుకునేవారే లేరు. ఈ పరిణామాలతో జగన్ విసుగెత్తిపోయారని అంటున్నారు. దానికి తోడు ఇదే నెలలో మరోమారు జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు. ఈసారి అమిత్ షాని, ఇతర నాయకులను కలుసుకోవాలని, కేంద్ర మంత్రులతో భేటీ కావాలని జగన్ షెడ్యూల్ పెట్టుకున్నారు. కానీ అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో జగన్ టూర్ వాయిదా పడిపోయింది. అయితే అది వాయిదానా లేక ఏకంగా ఢిలీ టూర్ క్యాన్సిల్ అయిందా అన్నది ఇపుడు రాజకీయ వర్గాల్లో  ఆసక్తికరమైన చర్చగా మారింది.


జగన్ కి ఢిల్లీ పెద్దలకు దూరం పెరుగుతోందని కూడా అంటున్నారు. జగన్ ఈ విషయంలో ఎంత వినయంగా ఉన్నా కూడా బీజేపీ కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీని పక్కన పెడుతోందన్న అనుమానాలూ వైసీపీ నేతల్లో ఉన్నాయి. ఏపీకి ఏ విధంగానూ సాయం చేయకపోవడం వల్ల జనంలో జగన్ బదనాం అవుతారని, దాన్ని అడ్వాంటేజి గా తీసుకుని పొలిటికల్ గా బలపడాలని  బీజేపీ స్కెచ్ వేస్తున్నట్లుగా కూడా  భావిస్తున్నారు. మరి ఈ పరిణామాలు చూస్తూంటే జగన్ ఇకపై ఢిల్లీ టూర్లకు ఫుల్ స్టాప్ పెడతారని అంటున్నారు. కేంద్రంలో ఇపుడు దోస్తీ కాకుండా న్యూట్రల్ గా ఉంటారని కూడ చెబుతున్నారు. చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: