ఇండియా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది.  ప్రతి విషయంలో ఆసియాలో ఇండియా అగ్రస్థానంలో ఉండాలని కోరుకుంటోంది.  చైనా, జపాన్, సౌత్ కొరియా దేశాలతో పోటీ పడుతున్నది. వాటికి ఏ మాత్రం తీసిపోకుండా ఇండియా భవిష్యత్తులో నిలుస్తుంది.  ఆసియాలో అనేక సంఘాలు ఉన్నాయి.  వాటిల్లో ఇండియా సభ్యదేశంగా ఉన్నది.  అయితే, ఇప్పుడు ప్రాంతీయ  సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య కూటమిలో ప్రస్తుతం 15 సభ్యదేశాలు ఉన్నాయి.  


ఈ సభ్యదేశాల సదస్సు నవంబర్ 4 వ తేదీ నుంచి బ్యాంకాక్ లో జరగబోతున్నది.  ఇందులో 16 వ సభ్యదేశంగా ఇండియా చేరాలా వద్ద అనే ఆలోచనలో పడింది.  దీనికి కారణం లేకపోలేదు.  ఒకవేళ ఇందులో సభ్యదేశంగా చేరితే.. సభ్యదేశాల నుంచి ఇండియాకు దిగుమతి చేసుకునే వస్తువులలో దిగుమతి సుంకం తగ్గించాలి.  దీంతో అవి ఇండియాలోకి వస్తే.. ఆ దేశాల నుంచి వచ్చే వస్తువుల ధరలు తగ్గిపోతాయి.  ఫలితంగా ఇండియాలోని ఆయా వస్తువులను తయారుచేసే వాటికి డిమాండ్ తగ్గుతుంది.  


ఆయా వస్తువులను ఎక్కువ ధరకు కొనుక్కోవడం కంటే.. దిగుమతి చేసుకున్న వస్తువులు తక్కువ ధరకు వస్తాయి కాబట్టి వినియోగదారుడు వాటిపైవు మొగ్గుచూపుతాడు. అందుకే అందులో సభ్యదేశంగా చేరాలా వద్దా అని ఆలోచిస్తున్నది.  సభ్యదేశంగా చేరొద్దని రైతులు, వాణిజ్యవేత్తలు పేర్కొంటున్నారు.  ఒకవేళ చేరినా దిగుమతి సుంకాలు తగ్గించొద్దని అంటున్నారు.  అయితే, ఇండియా ఈ సమితిలో భాగస్వామిగా ఉన్నది.  


ఇండియాతో పాటు, చైనా, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి.  అయితే, ఇవి సభ్యదేశాలుగా చేరలేదు.  ఇండియా సభ్యదేశంగా చేరాలని 15 సభ్యదేశాలు పట్టుబడుతున్నాయి.  దీనికి కారణం ఉన్నది.  ఒకవేళ సభ్యదేశంగా ఇండియా జాయిన్ అయితే, తక్కువగా తమ వస్తువులను ఇండియాకు ఎగుమతి చెయ్యొచ్చు.  అదే విధంగా ఇండియాను తక్కువ ధరకు ఉత్పత్తులను దిగుమతి చేసుకోవచ్చు.  ఒకవిధంగా ఇది మంచిదే.. కాకపోతే, స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది.  దిగుమతి చేసుకునే దానికంటే తక్కువ ధరకు స్వదేశీ ఉత్పత్తులను అందించాల్సి ఉంటుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: