తెలంగాణలో ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన బంద్ కొనసాగుతోంది. అయితే ఈ నెల 5న ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రారంభించారు. కాగా గత  14 రోజుల నుండి వివిధ రకాలుగా నిరసన తెలుపుతున్నప్పటికి ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోవడంతో... నేడు తెలంగాణ బంద్  ప్రకటించారు కార్మికులు . నిన్న ఆర్టీసీ సమ్మె పై  కోర్టు విచారణలో ప్రభుత్వం కార్మికులతొ  చర్చలు జరపాలని ప్రభుత్వం సూచించినప్పటికీ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కార్మికులతో చర్చలు జరపలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీసీ బంద్  అనివార్యమైంది. కాగా  నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న  సమ్మె ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. హైదరాబాద్ కరీంనగర్ నిజాంబాద్ లో ఆర్టీసీ సమ్మె తొ  ఉద్రిక్త  పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి . 

 

 

 

 నాగోల్  లోని బండ్లగూడ డిపో ముందు  బైఠాయించిన  కార్మికులు  డిపో నుంది బస్సులు  బయటకు వెళ్లకుండా అడ్డుకుని టైర్లకు మేకులు  కొట్టారు కా. అంతే కాకుండా తాత్కాలిక డ్రైవర్ ను చిదకబాదారు. ఈ నేపథ్యంలో పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో  పోలీసులకు కార్మికులకు మధ్య వాగ్వాదం జరిగింది. నిజామాబాద్  జిల్లాలోని  మాక్లూర్ మండలం దాస్ నగర్ లో... ఆర్టీసీ సమ్మెతో అంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. బస్సులపై ఆర్టీసీ కార్మికులు రాళ్లు రువ్వి  బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. అంతే కాకుండా గట్టిగా నినాదాలు చేస్తూ సమ్మెను కొనసాగిస్తున్నారు ప్రాంతం. 

 

 

 

 

 కాగా  కరీంనగర్లోను  ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. కరీంనగర్ బస్టాండ్ ఎదుట సీపీఎం నేతలు ప్రభుత్వం తీరును  నిరసిస్తూ నినాదాలు చేశారు. బస్సులపై సిపిఎం నేతలు కర్రలతో దాడి చేసి బస్సు సటైర్ లలో  ఉన్న గాలిని తీసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో సీపీఎం నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కాకా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇప్పటికే సమ్మెకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలు మద్దతు తెలపడంతో... రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె ఉదృతంగా కొనసాగుతుంది. సమ్మె చేస్తున్న ముఖ్య నేతలను ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: