తెలంగాణ ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు నెరవేర్చలేని కోరుతూ గత 14 రోజులుగా కార్మికులు సమ్మె చేస్తున్నారు.  ఈరాజు 15 వ రోజు.  ఈ 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పాటుగా సమ్మె చేస్తున్న 48వేలమంది కార్మికులు సెల్ఫ్ డిస్మిస్ పేరుతో ఉద్యోగాల నుంచి తొలగించినట్టు చెప్పడంతో కార్మికులు షాక్ అయ్యారు.  అయితే, తమ ఉద్యోగాలు ఎక్కడికి పోవని, న్యాయబద్దంగానే తాము డిమాండ్ చేస్తున్నామని ధీమాను వ్యక్తం చేస్తూ కార్మికులు సమ్మెకు దిగారు.  


ఈ సమ్మెకు బీజేపీ, కాంగ్రెస్, తెలుగుదేశం, జనసమితి, వామపక్ష పార్టీలు మద్దతు పలికాయి. తెలంగాణలోని మజ్లీస్ పార్టీకి.. తెరాస పార్టీకి దోస్తీ ఉన్నది కాబట్టి సమ్మె విషయంలో ఆ పార్టీ సైలెంట్ గా ఉన్నది.  ఇప్పుడు బంద్ విషయంలోనూ ఆ పార్టీ ఎలాంటి స్పందన తెలియజేయలేదు. దీనిపై స్పందిస్తే ఏమౌతుందో అని సైలెంట్ గా ఉండిపోయింది.  మరోవైపు వైకాపా కూడా ఈ విషయంలో సైలెంట్ గా ఉన్నది.  


కెసిఆర్ కు.. జగన్ కు మంచి దోస్తీ ఉన్నది.  పైగా హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో తెరాస తరపున ప్రచారం చేయాలనీ వైకాపా కార్యకర్తలకు సూచించారు.  తెరాస కు మద్దతు ఇస్తున్నట్టు జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అసలు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరగడానికి కారణం వైకాపానే.  ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతోనే ఈ ఇక్కడ సమ్మె చేయడం మొదలుపెట్టారు.  ఇప్పుడు ఈ విషయంలో వైకాపా కూడా కార్మికులకు మద్దతు ఇచ్చింది అంటే.. తెరాస.. వైకాపాల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది.  అందుకే సైలెంట్ గా ఉన్నది.  


అయితే, జనసేన పార్టీ పరిస్థితి ఏంటి అన్నది స్పష్టం కాలేదు.  ఆర్టీసీ ఉద్యోగులను తొలగించడం అన్యాయం అని చెప్పిన జనసేన పార్టీ.. సమ్మె విషయంలో, బంద్ విషయంలో మద్దతు ప్రకటిస్తున్నట్టు అక్టోబర్ 14 వ తేదీన తెలిపారు. అయితే ఇప్పటి వరకు సమ్మె చేస్తున్న నాయకులతో కలిసి పోరాటం చేయలేదు. ఇప్పుడు బంద్ సమయంలో జనసేన పార్టీ పాల్గొన్న దాఖలాలు కనిపించలేదు.  తెలంగాణలో కూనరిపోయే దశలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా సమ్మెకు మద్దతు ఇచ్చింది.  నేతలు బయటకు వచ్చి పోరాటం చేస్తున్నారు.  కానీ, జనసేన మాత్రం ఇంకా సైలెంట్ గా ఉండటం వెనుక అర్ధం ఏంటో తెలియడం లేదు.  వేదికలపై మాత్రమే కాదు.. ఇలా సమస్యలపై కూడా  బయటకు వచ్చి పోరాటం చేస్తే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: