ఉద్యమనేతగా ప్రచారం చేసుకుని సిఎం అయిన కెసియార్ ఏలుబడిలో ఆయనపైనే ఇంత వ్యతిరేకతా ?  తాజాగా రాష్ట్రవ్యాప్తంగా సంపూర్ణంగా జరుగుతున్న బందే కెసియార్ పై జనాల్లో పెరిగిపోయిన వ్యతిరేకతకు నిదర్శనంగా అర్ధమవుతోంది. ఆ బంద్ కు పిలుపిచ్చింది ఆర్టీసీ కార్మిక సంఘాలు. కార్మికసంఘాల బంద్ పిలుపుకు ఉద్యోగసంఘాలు, విద్యార్ధి సంఘాలు, రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, వామపక్షాలు మద్దతుగా నిలిచాయి. దాంతో బంద్ సంపూర్ణంగా విజయవంతమైంది.

 

నిజానికి కార్మికసంఘాలు కొన్ని డిమాండ్లతో  సమ్మె నోటిసు ఇచ్చినపుడే ప్రభుత్వం చర్చలు జరిపుంటే పరిస్ధితి ఇంతదాకా వచ్చుండేది కాదు. కార్మికులు సమ్మె నోటీసివ్వటమేంటి ? వారితో తాను చర్చలు జరపటమేంటి ? అనే అహంభావంతోనే కెసియార్ వాళ్ళను లెక్కచేయలేదు. చివరకు చిలికి చిలికి సమ్మె నీటీసే గాలివాన లాగ తయారైంది.

 

ఒకవైపు సమ్మె విషయంలో  న్యాయస్ధానం చర్చలు జరపటమని ప్రభుత్వానికి ఆదేశాలిచ్చినా లెక్క చేయటం లేదు.  రవాణా సౌకర్యాలు లేక  కోట్లాదిమంది జనాలు రెండు వారాలకు పైగా ఇబ్బందులు పడుతున్నా కెసియార్ పట్టించుకోవటం లేదు. కార్మిక సంఘాలతో చర్చలు జరపటమంటే తనకు చాలా అవమానంగా కెసియార్ భావిస్తున్నట్లుంది. అందుకనే ఆందోళన చేస్తున్న వాళ్ళను, మద్దతుగా నిలబడిన వాళ్ళనే కాకుండా చివరకు కోర్టులను కూడా ఏం చేసుకుంటారో చేసుకోండంటున్నారు కెసియార్.

 

ఆర్టీసీ ఉద్యమం తీవ్రమైపోయిన చివరకు రాష్ట్రబంద్ సంపూర్ణంగా విజయవంతమైందంటేనే కెసియార్ పై జనాల్లో ఏ స్ధాయిలో వ్యతిరేకత పెరిగిపోయిందో అర్ధమైపోతోంది. మొదటిసారి సిఎం అయినపుడు కెసియార్ వైఖరి ఇలాగుండేది కాదు.  కాస్త ఎదుటి వాళ్ళకు మర్యాదిచ్చి మాట్లాడేవారు.

 

ఎప్పుడైతే రెండోసారి మరింత మెజారిటితో గెలిచారో అప్పటి నుండే కెసియార్ వైఖరి పూర్తిగా మారిపోయింది. తన మాటకు ఎదురు చెప్పిన వాళ్ళను ఏమాత్రం సహించలేని అహంభావం కనిపిస్తోంది. దాని ఫలితమే ఈరోజు బంద్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరి దీని ప్రభావం హుజూర్ నగర్ ఉపఎన్నిక మీద పడితే అప్పుడు కెసియార్ ఏమి చేస్తారో చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: