హైద్రాబాద్ లో మెట్రో రైలు ఎంతో వేగంగా పోతుంది,ఎంతో ఆనందంగా ఉంది,అద్బుతం,కేక,తురుము,తోపు అని మాట్లాడుకున్న మాటలన్ని కూడా ఎక్కువ రోజులు లేవు.మొన్నా మధ్య పిల్లర్ ఊడి పడిపోవడం నవ వధువు దుర్మరణం అవ్వడం అందరికి తెలిసిన సంగతే అయితే అది అలా అలా సాగుతూ కొన్ని రోజులు గడిచాయో లేదో గాని ఇంతలోనే ఇంకో ఘోరం చోటు చేసుకుంది.

అసలే ఈ మధ్య ఆర్.టీ.సి సమ్మె జరుగుతూ జనం చాలా ఇబ్బందులు పడుతున్న సంగతి అందరికీ తెలిసిందే ఆ నేపధ్యంలో జనం అంతా కూడా మెట్రో లో ప్రయాణం చేస్తూ తీవ్ర రద్దీగా జరుగుతున్న క్రమం లో ఎల్.బి నగర్ నుండి మియపూర్ రూటు వైపు వెళ్లే మెట్రో ట్రైన్ లో నిన్న ఒక్కసారిగా జనం రద్దీ అవ్వడంతో మెట్రో బ్యానెట్ ఊడి పొయ్యి పడిపోవడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురి అయ్యి,భయంతో అందరి నోటా ఒకటే ఆందోళనతో బిక్కు బిక్కు మంటూ బతికేస్తున్నారు.

ఇలా హైద్రాబాద్ రూపు రేఖల్ని మార్చేసే,ఖ్యాతిని పెంచేసే గొప్ప ప్రాజెక్ట్ అంటూ తెలంగాణ లో చాలా సగర్వంగా ప్రారంభించిన మెట్రో ఇలా అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడేసింది.అసలే మెట్రో బాగా నడుస్తుంది అనే ఉద్దేశంతో కొత్త రూటు కూడా వేద్దాం అని ప్లాన్ చేస్తుంటే ఇప్పుడు మళ్లీ ఇలాంటి ఇన్సిడెంట్ జరగటం పై హైద్రాబాద్ వసూలు కాదు యావత్ భారత దేశం కూడా భయపడుతుంది.మెట్రో యొక్క ఎఫెక్ట్ దేశంలోని అన్ని మెట్రో లో తిరిగే వారు భయానికి లోనవుతున్నారు.ఇలా జరగకుండా అధికారులు,మెట్రో కార్మికులు, జనం కూడా వారి వారి భాద్యతలు సక్రమంగా కొనసాగించి మెట్రో మీద ఉన్న బాడ్ టాక్ ని శాశ్వతంగా నిర్ములించాలి అని చాలా కేర్ గా వ్యవరించాలి అని కూడా జనం అంత గగ్గోలు పెడుతున్నారు.ఇలాంటి ప్రమాదం మళ్ళీ మళ్ళీ జరిగితే మాత్రం ఖచ్చితంగా మెట్రోకి దెబ్బడిపోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: