ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో దీక్షలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరు అంటే అది తాజా మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో అనేక రకాలైన ధర్నాలు దీక్షలు చేసిన సంగతి అందరికి తెలిసిందే. కేంద్రంలో భారతీయ జనతా పార్టీతో కలిసి మెలిసి ఉన్నంత సేపూ  చంద్రబాబు నాయుడు ఒక రకమైన దీక్షలు చేశారు. వాటిని నవనిర్మాణ దీక్షలు అన్నారు. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నాకా ఇంకో రకమైన దీక్షలు చేశారు. అవి అన్నీ భారతీయ జనతా పార్టీ తీరును వ్యతిరేకిస్తూ  చేసినవి అని తెలిసిందే.


అవి అన్నీ ఏం చేసినా ఎందుకు చేసినా అవన్నీ ప్రజల చెల్లించిన సొమ్ముతో చేసినవి. తన రాజకీయ అవసరానికి తగ్గట్టుగా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు అనేక రకాల దీక్షలు చేస్తూ ముందుకు వెళ్లారు. వీటితో రాజకీయంగా ఏదో ఒక లబ్ధి చేకూరుతుందని ఆయన గట్టిగా భావించారు. అయితే అదేం కుదిరే పని కాదని ఎన్నికల ఫలితాలు వచ్చేంతవరకు కానీ స్పష్టత రాలేదు.


ఇది అంత ఇలా ఉంటే ప్రజల సొమ్ముతో మాత్రమే గాక దేవుడి సొమ్ముతో కూడా దీక్షలు చేశారూ అన్నది చంద్రబాబు నాయుడి మీద గట్టిగా వినిపించిన ఆరోపణ. ఢిల్లీలో చంద్రబాబు నాయుడు చేసిన దీక్షకు పూర్తిగా టీటీడీ నిధులు వాడారనే అభియోగాలు చాలానే ఉన్నాయి. ఈ విషయంలో అప్పటి నుంచే ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ఆలయం ఖాతాలోంచి నాలుగు కోట్ల రూపాయల డబ్బులులను వాడారట. చంద్రబాబు ఢిల్లీ దీక్ష కోసం ఆ నిధులను పూర్తిగా వినియోగించారని ఆరోపణలున్నాయి.


ఇక పోతే ఈ విషయంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతూ వస్తుంది. దేవుడి సొమ్మును ప్రభుత్వం అలాంటి అవసరాల కోసం వాడటం చాల తప్పు. అది భగవంతుడి మీద నమ్మకంతో ప్రజలు చెల్లించుకున్న కానుకలు. వాటితో రాజకీయం చేసే హక్కు, వాటిని రాజకీయ అవసరాల కోసం వాడే హక్కు ఎవరికీ ఉండదు. ఇలాంటి చట్ట పూరితమైన కూడా అయన ఆ పనిని చంద్రబాబు నాయుడు చేయించారని ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. దింతో దీనిపై విజిలెన్స్  విచారణ ఒక కొలిక్కి వచ్చిందని ఢిల్లీలోని టీటీడీ ఆధ్వర్యంలోని  నిధులు అలా బాబు రాజకీయాలకు అనుగుణంగా వాడటం జరిగిందని నిర్ధారించారని ప్రచారం జరుగుతూ వచ్చింది. దీనితో ప్రస్తుత నేపథ్యంలో తదుపరి చర్యలు ఎలా ఉండబోతాయి అన్నది ఆసక్తి దాయకమైన అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: