తెలంగాణాలో బంద్ కొనసాగుతోంది.. ఈ బంద్ కారణంగా తెలంగాణాలో ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. రాష్ట్రంలో బస్సులు బయటకు కదలడం లేదు.  ఆర్టీసీ బంద్ కు సంఘీభావంగా ఆటో, క్యాబ్ లు కూడా బంద్ లో పాల్గొన్నాయి.  దీంతో ప్రజా రవాణా పూర్తిగా స్తంభించింది పోయింది.  రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇంటికే పరిమితం అవుతున్నారు.  ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.  


అలానే వ్యాపార సంస్థలు, ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ సంఘాలు కూడా మద్దతు ఇచ్చాయి. హైదరాబాద్ లో కూడా ఇదే విధమైన పరిస్థితి కనిపించింది.  బస్సులు బయటకు వస్తున్న పరిస్థితి కనిపించడంలేదు.  ఇక ఇదిలా ఉంటె, తెలంగాణా బంద్ జరుగుతున్న నేపథ్యంలో ఏపి నుంచి తెలంగాణకు వచ్చే అన్ని బస్సులను ఏపీ ఆర్టీసీ రద్దు చేసింది.  దీంతో ఏపీ నుంచి తెలంగాణాకు వెళ్లే ప్రయాణకులు ఇబ్బందులు పడుతున్నారు.  


బస్సులు నడపడం లేదని కౌంటర్ల ముందు బోర్డులు తగిలించారు.  బంద్ పూర్తిగా ముగిసేవరకు బస్సులు నడపబోమని ఆర్టీసీ స్పష్టం చేసింది.  దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఎల్లుండి నుంచి తెలంగాణలో స్కూల్స్ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి.  స్కూల్స్ ప్రారంభం అవుతున్న సమయంలో బస్సులు తిరగకపోతే పడే ఇబ్బందులు చాలా ఉంటాయి.  


ఆర్టీసీ సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు బయటకు రావడం లేదు కాబట్టి, ప్రైవేట్, స్కూక్ బస్సులను దీనికోసం వినియోగిస్తున్నారు.  స్కూల్స్ స్టార్ట్ అయితే..స్కూల్ బస్సులు స్కూల్స్ కు వెళ్లిపోతాయి.  అప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి.. ప్రజలు ఎలా ప్రయాణం చేస్తారు..ప్రభుత్వం చర్చలకు పిలవకుంటే.. రాష్ట్రంలో సకలజనుల సమ్మె జరుగుతుందని సకలజన పోరాటానికి దారితీస్తుందని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.  ముందు చర్చలకు పిలవాలని, చర్చలకు పిలిస్తే దానిపై చర్చలు జరుగుతాయని, ఆ తరువాత ఏం జరుగుంది అన్నది చూడాలని ఆర్టీసీ కార్మికులు అంటున్నారు.  కానీ, ప్రభుత్వం నిరంకుశవైఖరిని ప్రదర్శిస్తే సమ్మె తీవ్రతరం అవుతుందని అంటున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: