శాసనవ్యవస్థ, కార్యనిర్వాహకవ్యవస్థ, న్యాయవ్యవస్థ - భారత రాజ్యాంగం ప్రకారం - ప్రజాస్వామ్య సౌధానికి ఈ మూడే మూలస్థంబాలు. అలాగే నాడు స్వాతంత్రోద్యమ సమయం నుండి ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేసిన పత్రికారంగం నేడు జనాకాంక్షతో  అనధికారికంగానైనా సువిశాల ప్రసారమాధ్యమంగా రూపుదిద్దుకొని రాజ్యాంగ నాల్గవ మూలస్థంభంగా మారింది. తద్వారా ప్రజాస్వామ్య రధం ఈ నాలుగు చక్రాల పై దిగ్విజయంగా ముందుకు సాగుతుందని రాజ్యంగ నిర్మాతలు భావించారు. 


తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంకృతాపరాధమేనని రాష్ట్ర హైకోర్టు తేల్చి పారేసింది. ప్రభుత్వ నిష్క్రియాపరత్వం  అనాలోచిత  నిర్ణయాలే కార్మికులను సమ్మెకు వెళ్లేలా ప్రోత్సహించాయనే కోణంలో, హైకోర్టు చేసిన కామెంట్లు కేసీఆర్ కు పెద్ద దెబ్బగానే పరిగణించక తప్పదు. 

ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పిటిషన్లపై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. కార్మికులు న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె నోటీసు ఇస్తే కనీసం వారితో చర్చలు కూడా ఎందుకు జరపలేక పోయారని ప్రభుత్వాన్ని ధర్మాసనం నిలదీసిన తీరు చూస్తుంటే, ఈ సమ్మె కేసీఆర్ గ్రాఫ్ ను అమాంతంగా కింద పడేసిందని చెప్పక తప్పదు.
  

ప్రజలు మద్దతు ఉన్న ఈ సమ్మెను దాదాపుగా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గుర్తించినా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించక పోవటం వలన  సకల జనులు పాల్గొని తాము సాధించుకున్న 'జన తెలంగాణా రాష్ట్రం' లో నాటి ఉద్యమ నేత కేసీఆర్, నేడు తెలంగాణా ముఖ్యమంత్రిగా ఉండగా ఈ నాలుగు చక్రాల రాజ్యాంగ రథం కుప్పకూలి పోతున్న దాఖలాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజల ఆశయాలకు తిలోదకాలిచ్చిన బంగారు తెలంగాణా నిర్మిద్ధామన్న ఈ ఉద్యమ నాయకుడు ఒక సామ్రాజ్య అధినేతలా మారి అధికారం మొత్తం తన కుటుంబ కభందహస్తాల్లో ఉంచుకొని నియంతృత్వ పాలన కొనసాగిస్తూ బంగారు కుటుంబాన్ని నిర్మించుకున్నారు. 
Image result for telangana bandh by TSRTC today
ఉద్యమంతో సాధించుకున్న తెలంగాణాను ఆరేళ్ళ పాటు అవిచ్చిన్నంగా విభిన్న వ్యూహాలతో పరిపాలన నిర్వహిస్తూవస్తున్న ఈ బంగారు కుటుంబం ధనిక రాష్ట్రాన్ని ఆర్ధికంగా దాదాపు దివాలా తీయించింది. 

నిరవధికంగా అవిచ్చిన్నంగా తెలంగాణలో 15 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు నేడు "రాష్ట్ర బంద్‌" కి పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులు పిలుపు నిచ్చిన బంద్‌ కి ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక  విద్యార్ధి ఉద్యోగ సంఘాలు పూర్తి మద్దతుగా నిలిచాయి. దీంతో ఆర్టీసీ కార్మికుల బంద్‌ ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడికక్కడ పోలీసులను మోహరించింది.

నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొన్ని చోట్ల ప్రశాంతంగా,  మరికొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా బస్సులన్నీ డిపోలకే పరిమిత మయ్యాయి. బంద్‌ కు మద్దతుగా ప్రతిపక్ష పార్టీలన్నీ ధర్నాలో పాల్గొన్నాయి. అన్ని పార్టీలకు చెందిన కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. 

Image result for telangana bandh by TSRTC today

ప్రొ. కోదండరాం లాంటి కీలక నేతలను, సీపీఐ నేతలను అరెస్ట్ చేయించింది. బంద్ నేపథ్యంలో చాలాచోట్ల బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ తదితర  బస్టాండ్ ల నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ఎక్కడి కక్కడ పోలీసులను మోహరించింది. కీలకనేతలను అరెస్ట్ చేయించింది. అయినప్పటికీ చాలా చోట్ల ఆందోళనలు,నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. ఆర్టీసీ కార్మికులు  తలపెట్టిన బంద్ కాస్తా ప్రభుత్వ వ్యతిరేకత పెల్లుభికి ప్రజల సానుభూతితో సకల జనుల సమ్మెను తలపిస్తుంది. 

నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్‌ నగర్ వద్ద ఆర్టీసీ బస్సుపై ఆందోళన కారులు రాళ్లు రువ్వారు. దీంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. దీంతో పోలీస్ భద్రత నడుమ బస్సును అక్కడినుంచి వరంగల్ వైపు తీసుకెళ్లారు. ఆర్మూర్‌ డిపోలో బస్సులు బయటకు రాలేదు. దీంతో ప్రయాణికులు లేక బస్ స్టేషన్లు నిర్మానుష్యం గా కనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌ - నాగోల్ బండ్లగూడ బస్ డిపో వద్ద డీజిల్ ట్యాంకర్‌ను ఆందోళన కారులు అడ్డుకున్నారు. డీజిల్ ట్యాంకర్ టైరుకు మేకులు కొట్టేందుకు ఆందోళన కారులు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. 
Image result for telangana bandh by TSRTC today
ప్రైవేట్ డ్రైవర్‌ ఒకరిని కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదుతుండగా పోలీసులు వారిని చెదరగొట్టారు. ఎంజీబీఎస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించి బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వరంగల్ జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. వ్యాపార,వాణిజ్య సంస్థలు స్వచ్చందంగా బంద్‌ లో పాల్గొంటాయి. బంద్ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు అడ్డగించే అవకాశం ఉండటంతో ప్రైవేట్ డ్రైవర్లు,కండక్టర్లు కూడా డిపోలకు రాలేదు. చాలాచోట్ల కార్మికులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్లకు తరలించారు. ప్రభుత్వ నిర్భంద మున్నా జన ప్రమేయంతో ఆర్టీసి ఉద్యోగుల రాష్ట బంద్ ఇప్పటికే సంపూర్ణంగా విజయవంతమైనది. 

మరింత సమాచారం తెలుసుకోండి: