మూలిగే నక్కపై తాటిపండు పడటమంటే ఇదే. అసలే ఆర్టీసీ కార్మికుల సమ్మెతో అవస్తలు పడుతున్న కెసియర్ కు  క్యాబుల సమ్మె మరో షాక్ ఇచ్చిందనే చెప్పారు. తమ సమస్యల పరిష్కారం కోసం క్యాబు డ్రైవర్లు కూడా సమ్మెబాట పట్టారు. శనివారం నుండి నిరవధిక సమ్మె చేస్తున్నట్లు క్యాబ్ డ్రైవర్ల జేఏసి చేసిన తాజా ప్రకటనతో మరింత ఇబ్బందులు పెరిగిపోవటం ఖాయం.

 

గడచిన 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు సమ్మె చేస్తున్న  విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు సమ్మె కారణంగా ఆర్టీసీ బస్సులు తిరగకపోయినా ఓలా, ఉబెర్ లాంటి క్యాబు సర్వీసులతో పాటు ఆటోలు, మెట్రో, ఎంఎంటిఎస్ లాంటి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండటంతో జనాలకు పెద్దగా నొప్పి తెలీలేదు.

 

అయితే తమ డిమాండ్ల సాధనతో పాటు ఆర్టీసీ జేఏసికి మద్దతుగా శనివారం నుండి ఓలా, ఉబెర్ డ్రైవర్లు కూడా సమ్మెబాట పట్టారు. నగరంలో ప్రతిరోజు సుమారు 50 వేల క్యాబ్ సర్వీసులు తిరుగుతుంటాయి. క్యాబుల్లో ప్రతిరోజు లక్షలమంది రాకపోకలు సాగిస్తుంటారు. ఇవికాకుండా ప్రత్యామ్నయ సర్వీసులైన ఆటోలు, మెట్రో, ఎంఎంటిఎస్ ఉండనే ఉంది.

 

జిహెచ్ఎంసి పరిధిలో ప్రతిరోజు సుమారు లక్ష ఆటోలు తిరుగుతుంటాయి. ఇక మెట్రో, ఎంఎంటిఎస్ సర్వీసుల్లో కూడా వేలాది మంది ప్రయాణిస్తునే ఉంటారు. అయితే ప్రజా రవాణాలో ఆర్టీసీ బస్సులు, క్యాబులు, ఆటోలదే ప్రముఖ పాత్ర అనటంలో సందేహం లేదు.

  

అలాంటిది ఈరోజు నుండి క్యాబులు డ్రైవర్లు కూడా సమ్మెబాట పడితే ప్రజారవణా దాదాపు నిలిచిపోవటం ఖాయమనే చెప్పాలి. బస్సులు, క్యాబుల సమ్మె కారణంగా మామూలు ఆటోల డ్రైవర్లు ప్రయాణీకులను వాయించేయటం ఖాయం. ఆటోల్లో కూడా ఉబెర్, ఓలా కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్న డ్రైవర్లున్నారు లేండి. మరి వాళ్ళేం చేస్తారో తెలీదు. మొత్తం మీద మరో రెడు రోజుల్లో సమ్మె గనుక ఆగకపోతే రాష్ట్రం మొత్తం మీద ప్రజా జీవితం స్తంభించిపోవటం ఖాయం. మరి అప్పుడు కెసియార్ ఏం చేస్తారో చూడాలి.

 


మరింత సమాచారం తెలుసుకోండి: