ఇటీవలే మధ్యం నిషేధం కారణంతో మద్యం దుకాణాల సంఖ్య తగ్గించడంతో పాటు వేళలను కూడా మార్చింది మన ప్రభుత్వం.కానీ దీన్ని పకడ్బందీగా అమలు చేయాల్సిన ఎక్సైజ్‌ శాఖ సర్కార్‌ లక్ష్యానికి తూట్లు పొడుస్తోంది. బార్ల నిర్వాహకులతో కుమ్మక్కై మందుబాబుల జేబుకు చిల్లు పెడుతోంది. అయితే అక్టోబర్‌ 1 నూతన మద్యం పాలసీ అమల్లోకి రాగా.. అప్పటి వరకూ నడుస్తున్న ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దయ్యాయి.ఇది కాస్తా బార్ల యజమానులకు కలసివస్తోంది. రాత్రి 11 గంటల వరకు అనుమతి ఉండటం.. ఎక్సైజ్‌ అధికారుల ప్రోత్సాహం తోడు కావడంతో బార్ల నిర్వాహకులకు కాసుల పంట పండుతోంది.

ఎక్సైజ్‌ అధికారుల సహకారంతో రెండు నెలల ముందు నుంచి బార్లలో రూ.కోట్లు విలువజేసే మద్యాన్ని డంప్‌ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబులు బార్ల వద్దకే క్యూ కడుతున్నారు.రోజుకు రూ.లక్ష జరిగే బార్లు.. నేడు రూ.10 లక్షల వరకూ కౌంటర్‌ జరుగుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.ఎక్సైజ్‌ అధికారులే అధికారికంగా బార్లకు సరఫరా చేస్తుండడం గమనార్హం. కొన్ని బార్లలో లూజు విక్రయాలు కూడా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఎంఆర్‌పీ ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోంది. ఫుల్‌బాటిల్‌పై రూ.100 అదనంగా వసూలు చేస్తున్నారు.


బార్ల నిర్వాహకులు ‘మందు’చూపుతో వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులను మచ్చిక చేసుకుని మద్యం నిల్వలను డంప్‌ చేస్తున్నారు. కోరిన మద్యం అందజేస్తూ కాసులు కురిపించుకుంటున్నారు. వైన్‌ షాపులకు సరుకు సరఫరా కాకుండా చూస్తూ దందా సాగిస్తున్నారు. ఎక్సైజ్‌ అధికారులను మామూళ్ల మత్తులో ముంచి మందు బాబులను పిండేస్తున్నారు.  


  • మ్యాన్షన్‌హౌస్‌..  వైన్‌షాపు ధర(క్వాటర్‌)150,బార్‌ ధర(క్వాటర్‌)180–200
  • ఎంసీ బ్రాందీ - వైన్‌షాపు ధర(క్వాటర్‌)140,బార్‌ ధర(క్వాటర్‌)170–190
  • మార్ఫియస్‌ - వైన్‌షాపు ధర(క్వాటర్‌)250,బార్‌ ధర(క్వాటర్‌)280–300
  • కింగ్‌ఫిషర్‌(స్ట్రాంగ్‌ బీరు) -వైన్‌షాపు ధర(క్వాటర్‌)130,బార్‌ ధర(క్వాటర్‌)160–170
  • నాకౌట్‌ -వైన్‌షాపు ధర(క్వాటర్‌)130, బార్‌ ధర(క్వాటర్‌)160–180
  • హేవర్డ్స్‌ (చీప్‌ లిక్కర్‌)-వైన్‌షాపు ధర(క్వాటర్‌)120, బార్‌ ధర(క్వాటర్‌) 150–160
  • కొరియర్‌ గ్రీన్‌ విస్కీ-వైన్‌షాపు ధర 230, బార్‌ ధర(క్వాటర్‌) 260–290
  • ఐబీ విస్కీ -వైన్‌షాపు ధర 150, బార్‌ ధర(క్వాటర్‌)  180–190

మరింత సమాచారం తెలుసుకోండి: