ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేస్తామని ఏనాడూ చెప్పలేదని అంటున్న టీఆరెస్ నేతలు , మంత్రులు ...మరి  ఆర్టీసీని సగం ప్రైవేట్ చేస్తామని కూడా తమ ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పలేదు కదా… మరి ఇప్పుడిదేంటీ? అంటూ విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు . ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేయాలన్న ప్రధాన డిమాండ్ తో ఆర్టీసీ కార్మికులు గత 15 రోజులుగా సమ్మె చేస్తున్న విషయం తెల్సిందే . అయితే ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా , పలువురు మంత్రులు బాహాటంగానే చెబుతున్నారు .


 దానికితోడు తాము ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం లో చేస్తామని ఏనాడు చెప్పలేదని , తమ  ఎన్నికల మేనిఫెస్టో లో కూడా హామీ ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు . మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ , వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు,  ఆర్టీసీ కార్మికుల చేస్తోన్న సమ్మెపై  విమర్శలు చేయడమే కాకుండా , ఆర్టీసీని ప్రభుత్వం లో విలీనం చేసేది ఖరాఖండిగా తేల్చి చెప్పడాన్ని కార్మిక సంఘాల నేతలు ,  విపక్ష నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు . తెలంగాణ ఉద్యమం లో ఏనాడూ పాల్గొనని  మంత్రుల బాధ్యతరహిత  వ్యాఖ్యల వల్లే కార్మికుల మనోభావాలు దెబ్బతిన్నాయని అంటున్నారు .


 ఇక తెలంగాణ ఉద్యమం లో పాల్గొనని  మంత్రులు పువ్వాడ అజయ్ , తలసాని , వేముల ప్రశాంత్ రెడ్డి , సమ్మె గురించి మాట్లాడడం పట్ల కార్మిక జెఎసి  నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ , మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి వంటి వారు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు . గత 15 రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మొండికేస్తూ చర్చలకు పిలవకపోవడాన్ని   విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి .


మరింత సమాచారం తెలుసుకోండి: