గత కొన్ని రోజులుగా బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకుంటూ ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన తెలుగుదేశం పార్టీతో తమ అనుబంధం పై మాట్లాడారు. ఓడిపోయిన తెలుగుదేశం పార్టీతో అనుబంధం పెంచుకోవాల్సిన అవసరం బిజెపి పార్టీకి లేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ శక్తిగా ఎదగాలని బీజేపీ భావిస్తోందే  తప్ప వేరే పార్టీలకు మద్దతు ఇచ్చి ఉద్దరించాల్సిన అవసరం బిజెపికి లేదని స్పష్టం చేశారు ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 

 

 

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒంటరిగానే ఎదుగుతాం తప్ప టిడిపితో పొత్తు పెట్టుకోమని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించిన జీవీఎల్ నరసింహారావు... పోలవరం ప్రాజెక్టు విషయంలో ఎన్నో తప్పులు జరిగాయని గతంలో తాము చెప్పామని... ఇప్పుడు అదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా  చెబుతోందని ఆయన అన్నారు. అయితే పోలవరం ప్రాజెక్టు విషయంలో 2,200 కోట్ల అవినీతి జరిగిందని చెబుతున్న వైసీపీ ప్రభుత్వం... దీనిపై చర్యలు మాత్రం ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు బిజెపి ఎంపీ జివిఎల్  నరసింహారావు. 

 

 

 

 

 పోలవరం ప్రాజెక్టు విషయంలో అవినీతి జరుగుతుంది అని చెబుతున్న ప్రభుత్వం... దానిపై మాత్రం ఎందుకు స్పందించడం లేదు అనే దానిపై ముఖ్యమంత్రి జగన్, ఆయన పార్టీ తప్పకుండా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలోను తమది ఇదే  డిమాండ్ అన్న   జివిఎల్  నరసింహారావు... గత ప్రభుత్వం ఎక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి... తక్కువ ధరకు భూములను ఎవరికి కేటాయించారనే  సమాచారం... రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నప్పటికీ... వారిపై చర్యలు తీసుకోకుండా వైసీపీ ప్రభుత్వం ఎందుకు నీళ్ళు నములుతూ ఉందని ప్రశ్నించారు జివిఎల్  నరసింహారావు. అవినీతి జరుగుతుంది ఆధారాలు ఉన్నాయి అని చెబుతున్న ప్రభుత్వం... అవినీతి చేసిన వారిపై ముందుగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: