హర్యానా ఎన్నికల ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. చివర దశకు చేరుకోవడంతో.. కాంగ్రెస్ పార్టీ తన వంతుగా ప్రచారం చేసేందుకు పరుగులు తీస్తోంది.  కాగా, నిన్నటి రోజున హర్యానాలో కాంగ్రెస్ పార్టీ తరపున కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకు కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే, 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.  దీంతో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేశారు.  


చాలా రోజులపాటు అయన రాజీనామాను పార్టీ అంగీకరించలేదు.  కానీ, చివరకు అంగీకరించాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షపదవి నుంచి తప్పకున్న తరువాత, కాంగ్రెస్ పార్టీకి శాశ్వత అధ్యక్షుడిగా ఎవరిని నియమించలేదు.  ప్రస్తుతానికి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షునిగా నియమితులైనారు.  అయితే, అనారోగ్యం కారణంగా ఆమె బయట ఎక్కువగా కనిపించడం లేదు.  


హర్యానాలో ఎన్నికల ప్రచారం చేపట్టాల్సి ఉన్నది.  కానీ, అనారోగ్యం కారణంగా ఆమె హర్యానా వెళ్లలేకపోయింది. సోనియా గాంధీ పర్యటించాల్సిన ప్రాంతంలో రాహుల్ పర్యటించి ప్రసంగించారు.  కాగా, అక్కడి నుంచే ఢిల్లీ వెళ్లే సమయంలో హెలీకాఫ్టర్లో బయలు దేరారు.  కానీ, కొన్ని సాంకేతిక కారణాల వలన హెలికాఫ్టర్ ను రివాడిలోని కెఎల్పీ మైదానంలో దించారు.  


కాగా, అప్పటికే ఆ మైదానంలో కొంతమంది యువకులు, విద్యార్థులు క్రికెట్ ఆడుతున్నారు.  వాతావరణం సహకరించేవరకు ఆ కాలేజీ గ్రౌండ్లోనే ఉన్నారు.  అక్కడ క్రికెట్ ఆడుతున్న విద్యార్థుల దగ్గరకు వెళ్లి.. క్రికెట్ ఆడటం మొదలుపెట్టారు.  క్రికెట్ బ్యాట్ పుచ్చుకొని ఆడేందుకు రాహుల్ రెడీ అయ్యాడు.  గ్రౌండ్ బయట ఉండగా తప్పకుండా షాట్స్ కొట్టాలి అనుకున్న రాహుల్, బ్యాట్ పట్టుకొని మైదానంలోకి వెళ్లిన పాపం పిల్లలు వేసిన బాల్స్ కొట్టడానికి చాలా కష్టపడ్డారు.  మైక్ పట్టుకున్నప్పుడు తడబడి.. బ్యాట్ పట్టుకున్నప్పుడు కూడా అలాగైతే ఎలా చెప్పండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: