హుజూర్ నగర్ ఉప ఎన్నిక ను అధికార టీఆరెస్ , కాంగ్రెస్ పార్టీ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి . ఈ ఎన్నిక లో ఎలాగైనా గెల్చేందుకు సర్వ శక్తులు ఒడ్డుతున్నాయి . హుజూర్ నగర్ ఉప ఎన్నికలో  టీఆరెస్ తో పాటు కాంగ్రెస్ , బీజేపీ , టీడీపీ అభ్యర్ధులతోపాటు , పలువురు ఇండిపెండెంట్లు కూడా పోటీ లో ఉన్నారు . టీఆరెస్ , కాంగ్రెస్ తో పాటు ఇతర ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తు న్నాయి  .    గెలుపుకు ప్రతి ఓటు కూడా కీలకం కావడంతో , ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు పాచికలు వేస్తున్నట్లు తెలుస్తోంది .


 అదే సమయం లో ఎన్నికల సంఘం (ఈసీ ) కూడా డేగ కళ్ళతో నిఘా వేస్తుండడం తో ప్రధాన పార్టీలు అప్రమత్తమయ్యాయి  . ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ , ఇప్పటికే ఓటర్లకు పంచాల్సిన డబ్బు హుజూర్ నగర్ చేరిపోయిందన్న వాదనలు విన్పిస్తున్నాయి . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకూ ప్రధాన పార్టీల అభ్యర్థులు పంచినట్లు తెలుస్తోంది . ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్టాత్మకం కావడం తో , ఓటర్లకు నోట్ల వరద పారే అవకాశాలున్నాయని సమాచారం .


  హుజూర్ నగర్ ఉప ఎన్నిక గెల్చి  అధికార టీఆరెస్ తమకు తిరుగులేదని నిరూపించుకోవాలని భావిస్తుండగా , నల్గొండ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా తో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక లో ఎలాగైనా తన సతీమణి పద్మావతిని గెలిపించుకోవడం ద్వారా, నియోజకవర్గం లో  తన  పట్టు సడలలేదని నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: