గత 14 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా నేడు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది ఆర్టీసీ జేఏసీ . కాగా నేడు తెలంగాణ బంద్ లో భాగంగా రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎక్కడికక్కడ ప్రభుత్వం తిప్పుతున్న బస్సులు నడవకుండా ఆర్టీసీ కార్మికులు అడ్డుకోవడంతో... పోలీసులకి ఆర్టీసీ కార్మికులకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. కాగా బంద్  నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక సమ్మెకు మద్దతు ప్రకటించిన అన్ని ప్రతిపక్ష పార్టీలు... బంద్  నిర్వహిస్తుండగా పార్టీల నేతలందరినీ ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఇంకొంతమందిని గృహనిర్బంధం కూడా చేస్తారు. 

 

 

 

 ఆర్టీసీ సంస్థ పరిస్థితి అద్వానంగా ఉందని... తమకు  ఉద్యోగ భద్రత కరువైందని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు వేతన సవరణ చేయాలన డిమాండ్ తొ  ఆర్టీసీ కార్మికులు ఈ నెల 5న సమ్మె సైరన్ మోగించారు. అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో మొదటినుంచి ప్రత్యామ్నాయం వైపు మొగ్గు చూపిన ముఖ్యమంత్రి కేసీఆర్... గత 14 రోజుల నుండి ఆర్టీసీ కార్మికులు వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్న   కెసిఆర్ మాత్రం స్పందించలేదు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నేడు బంద్ నిర్వహించింది ఆర్టీసీ జేఏసీ. కాగా ఈ బంద్ కు ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు,  ఉద్యోగ సంఘాలు,  ఉద్యమ  సంఘాలు మద్దతు తెలిపాయి. 

 

 

 

 

 అయితే నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ జేఏసీ చేపట్టిన బంద్ సంపూర్ణమైనట్లు  ఆర్టీసీ ఐకాస ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది ఆర్టిసి ఐకాస.తమ  న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న పోరాటంలో భాగంగా తెలంగాణ బంద్ నిర్వహించగా... బంద్ కు మద్దతిచ్చిన  అన్ని వర్గాలకు కృతజ్ఞతలు తెలిపింది ఆర్టీసీ ఐకాస. అయితే ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు ఐకాస నేతలు ప్రకటించారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని కోరారు. కాగా  ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించకపోవడంతో ఆర్టీసీ సమ్మె కొనసాగింపుపై ఈరోజు సాయంత్రం భవిష్యత్తు కార్యాచరణను  ప్రకటిస్తామని ఆర్టీసీ ఐకాస నేతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: