ఒకే ఒక్క నిర్ణ‌యం.. దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌నితీరుకు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. అంతే కాదు.. ఈ నిర్ణ‌యంతో సొంత పార్టీ నుంచి ఇత‌ర పార్టీల నుంచి ఎక్క‌డ లేని ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి జ‌గ‌న్ కు . సీఎం జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా సొంత పార్టీ నేత‌లు ప్ర‌శంసించ‌డం కామ‌నే. కాకుంటే పొరుగు రాష్ట్రాల‌కు చెందిన ఇత‌ర పార్టీ నేత‌లు, అందులో ప్ర‌జాప్ర‌తినిధులుగా ప‌నిచేసిన వారు ప్రశంసిస్తుంటే అది క‌చ్చితంగా ఎంతో మంచి నిర్ణయం అయి ఉంటుంద‌ని వేరేగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.. ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌యంతో అటు సొంత పార్టీలో హ‌ర్షం వ్య‌క్తం అవుతుంది. ఇటు రాష్ట్రంలోని నిరుద్యోగులు, ఉద్యోగులు, ప‌లు ప్ర‌జాసంఘాల నుంచి ప్ర‌సంశ‌లు వ‌స్తున్నాయి.


ఇక పొరుగురాష్ట్ర‌మైన తెలంగాణ‌కు చెందిన నేత‌లు హ‌ర్షం వ్యక్తం చేస్తూ ఏకంగా సీఎం జ‌గ‌న్ ట్వీట్ట‌ర్‌కు పోస్టులు చేస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.. ఇంత‌కు జ‌గ‌న్ తీసుకున్న ఆ నిర్ణ‌యం ఏమై ఉంటుంద‌నే కుతుహలం మీలో కూడా క‌లుగుతుంది క‌దా.. ఏపీ సీఎం జ‌గ‌న్ ఇక‌ముందు ఏపీపీఎస్‌సీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఉద్యోగాల ఎంపిక‌కు ఇంట‌ర్వ్యూలు ఉండ‌వు.. ఇంట‌ర్వ్యూ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా భారీ చ‌ర్చ‌కు దారీ తీసింది. ఈ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తూ తెలంగాణ‌కు చెందిన భువ‌న‌గిరి మాజీ ఎంపీ, తెరాస నేత బూర న‌ర్స‌య్య గౌడ్ ఏకంగా జ‌గ‌న్ కు ట్వీట్ చేయ‌డం విశేషం...


సెలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్వ్యూ రద్దు చేయడం శుభపరిణామం. ఎక్కువరకు కాష్ , క్యాస్ట్ చెందిన అవకతవకలు ఇంటర్వ్యూ సమయంలో జరుగుతవి. రాజకీయ నాయకుల మీద వత్తిడి, రాజకీయ నాయకుల వత్తిడి కూడా ఇంటర్వ్యూ సందర్భంలోనే ఉంటది . ఇంటర్వ్యూ రద్దు పారదరర్శకతకు నిదర్శం.  ముఖ్య మంత్రిగారికి అభినందనలు తెలుపుతూ టీ ఆర్ ఎస్ మాజీ ఎంపీ బూర న‌ర్స‌య్య గౌడ్ ట్వీట్ట‌ర్‌లో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ట్విట్ చేశారు. బూర న‌ర్స‌య్య చేసిన కామెంట్ ను ప‌రిశీలిస్తే వాస్తవానికి ఉద్యోగం వ‌స్తుందని ఎంద‌రో ప్ర‌తిభావంతులు ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తారు. కానీ ఇంట‌ర్వ్యూ పేరుతో వారి ఆశ‌ల‌కు స‌మాధి క‌డుతున్నారు.


ఈ ప‌ద్ద‌తి లేకుంటే ప్ర‌తిభావంతుల‌కు ఉద్యోగాలు రావ‌డం ఖాయ‌మేగా.. అని ప్ర‌తి ఒక్క‌రు అనుకుంటున్నారు. దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఇలా ఇంట‌ర్వ్యూల వ్య‌వ‌స్థ ఉంది. దీంతో అధికారంలో ఉన్న పార్టీలు ఎక్కువ‌గా ఎంద‌రో ప్రతిభావంతుల‌ను తొక్కేస్తున్నాయి. ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ తీసుకున్న ఈ సాహ‌సోపేత నిర్ణ‌యం ఎంద‌రికో ఆద‌ర్శ‌వంతంగా ఉండ‌నున్న‌ది... జ‌గ‌న్ చేసిన ఈ ప‌ని అవినీతికి ఆస్కారం లేని విధంగా చేయాల‌నే సంక‌ల్పానికి నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. అవినీతికి బాట‌లు వేసే ఏ ప‌థ‌క‌మైనా ఇక‌ముందు స‌మీక్షించి దాన్ని ర‌ద్దు చేయ‌డ‌మా.. లేక స‌వ‌ర‌ణ‌లు చేయ‌డ‌మా అనే మాట‌కు క‌ట్టుబ‌డేలా జ‌గ‌న్ నిర్ణ‌యాలు క‌నిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: