తెలుగ దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. శనివారం ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు.  టీడీపీ విశ్వసనీయత, సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర ఏముందని ఆయనతో కలిసి వెళ్ళతామాన్నారు. ఓడిపోయిన పార్టీ నుంచి 10 మంది నేతలు వస్తే బీజేపీ బలపడదని అన్నారు. వారి రాజకీయ భవిష్యత్ కోసమే బీజేపీలోకి వస్తున్నారని ఆరోపినారు. చంద్రబాబును తాము సీఎంగా చేశామన్నారు. కానీ కులాలు, మతాలతో రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూశారని విమర్శించారు. చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఉంటే తాను తమ అధిష్టానంతో మాట్లాడతానాని చెప్పారు.



చంద్రబాబును తామేమి భయపెట్టడం లేదన్నారు. అవినీతి ఎవరు చేసినా శిక్ష తప్పదని మోడీ స్పష్టం చేసారని చెప్పారు. మోడీ మాటలకు చంద్రబాబు నాయుడు భుజాలు తడుముకుంటే తామేమి చేయలేమని చెప్పారు. పోలవరంలో అవినీతి జరగలేదని మా పార్టీ నేతలు ఎవరూ చెప్పలేదన్నారు. రూ.2,200 కోట్ల అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించిందని చెప్పారు. దీనిపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందన్నారు.పోలవరం ,అమరావతిలో అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పు చేయడం తప్పు కాదు.. దాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం దుర్వినియోగం చేయడం తప్పన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబును లెక్కలు అడిగాం...కానీ ఆయన చెప్పలేదన్నారు. చంద్రబాబు లెక్కలు ఎందుకు చెప్పలేకపోతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. రుణాల ఎగవేత విషయంలో ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. దీనికి సుజనా చౌదరి కూడా అతీతుడు కాదని చెప్పారు. అందరిలాగే సుజానా కూడా బ్యాంకులకు రుణాలు కట్టాల్సిందనని నరసింహారావు స్పష్టం చేశారు. బీజేపీలో చేరినంత మాత్రాన సుజానాకు మినహాయింపులుండదని చెప్పారు. 



తెలుగ దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన ఉనికిని కాపాడుకునేందుకే బీజేపీ పై విమర్శలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. శనివారం ఆయన మీట్ ది ప్రెస్ లో మాట్లాడారు.  టీడీపీ విశ్వసనీయత, సిద్ధాంతం లేని పార్టీ అని తీవ్రంగా దుయ్యబట్టారు. చంద్రబాబు దగ్గర ఏముందని ఆయనతో కలిసి వెళ్ళతామాన్నారు. ఓడిపోయిన పార్టీ నుంచి 10 మంది నేతలు వస్తే బీజేపీ బలపడదని అన్నారు. వారి రాజకీయ భవిష్యత్ కోసమే బీజేపీలోకి వస్తున్నారని ఆరోపినారు. చంద్రబాబును తాము సీఎంగా చేశామన్నారు. కానీ కులాలు, మతాలతో రాజకీయాలు చేయాలని చంద్రబాబు చూశారని విమర్శించారు. చంద్రబాబు బీజేపీకి దగ్గరవుతున్నామని ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర పథకాలను తన పథకాలుగా చంద్రబాబు ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. బీజేపీలో టీడీపీని విలీనం చేసే ఉద్దేశం చంద్రబాబుకు ఉంటే తాను తమ అధిష్టానంతో మాట్లాడతానాని చెప్పారు. చంద్రబాబును తామేమి భయపెట్టడం లేదన్నారు. అవినీతి ఎవరు చేసినా శిక్ష తప్పదని మోడీ స్పష్టం చేసారని చెప్పారు.




మోడీ మాటలకు చంద్రబాబు నాయుడు భుజాలు తడుముకుంటే తామేమి చేయలేమని చెప్పారు. పోలవరంలో అవినీతి జరగలేదని మా పార్టీ నేతలు ఎవరూ చెప్పలేదన్నారు. రూ.2,200 కోట్ల అవినీతి జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించిందని చెప్పారు. దీనిపై రివర్స్ టెండరింగ్ కు వెళ్లామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుందన్నారు. పోలవరం ,అమరావతిలో అవినీతికి పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పు చేయడం తప్పు కాదు.. దాన్ని ఎన్నికల్లో గెలవడం కోసం దుర్వినియోగం చేయడం తప్పన్నారు. గతంలో పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం ఇచ్చిన నిధులకు చంద్రబాబును లెక్కలు అడిగాం...కానీ ఆయన చెప్పలేదన్నారు. చంద్రబాబు లెక్కలు ఎందుకు చెప్పలేకపోతున్నారో అర్థం కావడం లేదని చెప్పారు. రుణాల ఎగవేత విషయంలో ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. దీనికి సుజనా చౌదరి కూడా అతీతుడు కాదని చెప్పారు. అందరిలాగే సుజానా కూడా బ్యాంకులకు రుణాలు కట్టాల్సిందనని నరసింహారావు స్పష్టం చేశారు. బీజేపీలో చేరినంత మాత్రాన సుజానాకు మినహాయింపులుండదని చెప్పారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: