గత 15 రోజులుగా చేస్తున్న ఆర్టీసీ సమ్మె ఉదృతం అయ్యింది.  ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా బంద్ ను నిర్వహించారు.  ఈ బంద్ విజయవంతం కావడంతో.. ప్రభుత్వం ఆలోచనలో పడింది.  బంద్ ఈ విధంగా విజయవంతం అవుతుందని అనుకోలేదు.  ఆర్టీసీ కార్మికులకు వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, ఇతర ఉద్యోగ సంఘాలు సంఘీభావం తెలిపాయి.  హుజూర్ నగర్ ఎన్నికల తరువాత ఈ ఉద్యమాన్ని మరింత ఉదృతం చేయబోతున్నట్టు చెప్తున్నారు.  


వివిధ సంఘాలకు చెందిన జేఏసీ నేతలు ఆర్టీసీ జేఏసీ తో చేతులు కలిపేందుకు సిద్ధం అయ్యారు.  వారితో పాటుగా కలిసి సమ్మె చేసేందుకు సిద్ధం అవుతున్నారు.  ఆర్టీసీ కార్మికుల సమ్మె కాస్త సకలజనుల సమ్మెగా మారబోతుందా అంటే అవుననే అంటున్నారు.  ఒకవేళ ఇదే నిజమైతే ప్రజలు ఇంకా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  సకలజనుల సమ్మె కారణంగానే 2014లో తెలంగాణ వచ్చింది.  


ఇప్పుడు అదే తరహాలో డిమాండ్ల కోసం ఆర్టీసీ జేఏసీ ఇతర ఉద్యోగ సంఘాలు కూడా మద్దతు ఇస్తున్నాయి.  ఇక భవిష్యత్ కార్యాచరణ విషయాన్ని ఈరోజు ప్రకటించబోతున్నారు. అయితే, బంద్ చేసే సమయంలో అనేక చోట్ల ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  కొన్ని చోట్ల నేతలను అరెస్ట్ చేయగా, మరికొన్ని చోట్ల కొన్ని అనుకోని పరిణామాలు చోటుచేసుకున్నాయి.  


బస్సులను కొన్ని చోట్ల బలవంతమగా బయటకు తీసుకురాగా వాటిని కార్మికులు అడ్డుకున్నారు.  అలానే ఆటోలు కొన్నింటిని బయటకు రావడంతో కార్మికులు అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లాపైనే పోలీసులు ఎక్కువుగా దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే.  ఆ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే డ్రైవర్ ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు ఆ జిల్లాపైనే దృష్టి పెట్టి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్నారు.  మొత్తానికైతే సమ్మె విజయవంతం అయ్యిందని మాత్రం చెప్పొచ్చు.  


మరింత సమాచారం తెలుసుకోండి: