ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ నేత వర్ల రామయ్యలు గత కొన్ని రోజులుగా పోలీసులు వైసీపీ జెండాలు మోస్తున్నారని... ఖబర్దార్ అంటూ  బెదిరింపులకు గురి చేస్తున్నారు.ఈ నేపథ్యంలో  వైసీపీ నేతలు పోలీసుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే విదంగా మాట్లాడుతూ పోలీసులని బెదిరింపులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ నేత వర్ల  రామయ్యల పై అంటూ అడంగల్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు  చేశారు  వైసీపీ ఎమ్మెల్యేలు. పోలీసులను బెదిరింపులకు గురి చేస్తున్న   చంద్రబాబు, వర్ల రామయ్యలపై  పై చర్యలు తీసుకోవాలంటూ అరండల్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. 506, 503, 353, 153a సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలంటూ పిర్యాదు చేసారు . 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు పోలీసులను బెదిరింపులకు గురి చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ అందిస్తున్న పారదర్శక పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు ఇవన్నీ చేస్తున్నాయని అన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెబుతున్న చంద్రబాబు హద్దు దాటి మితిమీరిన విమర్శలు చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే రజిని సహా పలువురు వైసిపి నేతలు అడంగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 

 

 

 

 జగన్ అందిస్తున్న సంక్షేమ పాలన చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు ఇదంతా  రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. కులం మతం వర్గం తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తున్నారని... అయినప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి అని అన్నారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు టిడిపి నేత వర్ల రామయ్యలు చాలా సార్లు పోలీలులను మితిమీరి విమర్శించి బెదిరింపులకు గురి చేశారని అన్నారు. చంద్రబాబు వర్ల రామయ్య లు  పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తినేలా విమర్శలు చేస్తున్నారని ఆరోపిస్తూ వీరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్స్ చేసారు . 

 

 

 

 

 ఈ సందర్భంగా మాట్లాడిన వైసిపి నేతలు రాజకీయాల్లో  40ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు... పోలీసులపై విమర్శలు చేసి పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అందిస్తున్న ప్రజా సంక్షేమ పాలన చూసి ఓర్వలేకనే అనవసర విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు . పోలీసుల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా విమర్శలు చేసిన  టీడీపీ అధినేత చంద్రబాబు సహా వర్ల రామయ్యలపై  చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే విడుదల రజిని సహా ఇంకొంతమంది వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వైసిపి నేతల ఫిర్యాదును స్వీకరించిన ఎస్సై ఈ విషయాన్నీ  ఉన్నతాధికారుల  దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటామని  తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: