అందరూ అనుమానిస్తున్నట్లే జరుగుతోంది. చంద్రబాబునాయుడుపై వైసిపి ఎంఎల్ఏలు, నేతలు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసిన తర్వాత పోలీసులు కేసు కట్టకుండా ఎలాగుంటారు. వాళ్ళు ఫిర్యాదు చేయటం, పోలీసులు కేసు కట్టడం వరకూ ఓకే. తర్వాత స్టెప్పే ఏంటనేది సస్పెన్స్ గా మారింది.

 

గడచిన నాలుగు నెలలుగా తనపై పోలీసులు కేసులు పెట్టాలంటూ చంద్రబాబు పదే పదే పబ్లిక్ గా డిమాండ్ చేసిన విషయం అందరూ చూస్తున్నదే. ఎన్నికలకు ముందేమో కేంద్రప్రభుత్వం తనపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలనే కుట్ర చేస్తున్నదంటూ పదే పదే యాగీ చేసేవారు. అయితే కేంద్రం కేసు పెట్టింది లేదు, అరెస్టు చేసిందీ లేదు.  కేంద్రం తనను అరెస్టు చేస్తే సింపతీ వచ్చి ఎన్నికల్లో లబ్ది పొందవచ్చన్న చంద్రబాబు ప్లాన్ వర్కవుట్ కాలేదు.

 

మొత్తానికి ఎవరి ప్లాన్ ఎలాగున్నా జనాలైతే టిడిపి గూబగుయ్యిమనిపించారు. దాంతో ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చిన చంద్రబాబు అప్పటి నుండి జగన్మోహన్ రెడ్డిపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రతి చిన్న విషయాన్ని జగన్ కు ముడేసి తీవ్రమైన ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. అదే సమయంలో  టిడిపి నేతలపై నమోదవుతుండటంతో పోలీసులపై విరుచుకుపడుతున్నారు.

 

తమ నేతలపై కేసులు పెట్టటం కాదని దమ్ముంటే తనపైనే కేసు పెట్టి అరెస్టు చేయాలంటూ ఒకటికి పదిసార్లు పోలీసులను రెచ్చగొడుతున్నారు. అధికారంలో ఉన్నపుడు తాను చెప్పిన మాటను పోలీసులు ఎలా వినేవారో ఇప్పుడు కూడా అలాగే వినాలన్నది చంద్రబాబు ఉద్దేశ్యంగా కనబడుతోంది.

 

అధికారంలో ఉన్నపుడు వింటారు కానీ ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా పోలీసులు తన మాట వినాలంటే సాధ్యమవుతుందా ? అధికార పార్టీకి పోలీసులు తొత్తులుగా మారిపోయారంటూ విచిత్రమైన వ్యాఖ్యలు చేయటమే కాకుండా పదే పదే వారిని బెదిరిస్తున్నారు.  పోలీసు అధికారులపై కోర్టుల్లో  ప్రైవేటు కేసులు పెడతామని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.

 

డ్యూటిలో ఉన్న పోలీసు అధికారులను తన నేతలతో నోటికొచ్చినట్లు తిట్టిస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత లాభం లేదనుకునే వైసిపి ఎంఎల్ఏలు చంద్రబాబుపై గుంటూరులోని అరండల్ పోలసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మరి పోలీసులు ఇపుడేం చేస్తారో చూడాలి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: