తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత వస్తున్న తొలి ఉప ఎన్నిక కావడం వల్ల హుజూర్‌నగర్‌ పై సర్వత్రా ఆసక్తి రేపుతుంది.ఇప్పటికే   ప్రచార సమయం ముగిసింది. ఈ ఉప ఎన్నికలు ప్రతి పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి .ఇప్పటికే ఆర్టీసీ సమ్మెతో ఇరకాటం లో ఉన్న టిఆర్ఎస్ ఎలాగైనా ఈ సీటు సంపాదించి ప్రజలు తమ వైపు ఉన్నారని సందేశాన్ని ఇతర పార్టీలకు గట్టిగా వినిపించే లాగా చేయాలి అని  చాలా కష్టపడుతుంది.

అదేవిధంగా కాంగ్రెస్ కూడా సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఇక బీజేపీ పరిస్థితి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఊపుని కొనసాగించాలని అమిత్ షా  నాయకత్వంలో  వ్యూహ రచన జరిగింది. హుజూర్‌నగర్‌ నిజానికి కాంగ్రెస్ ఖర్చు కంచుకోట లాంటిది. శుక్రవారం బిజెపి నేత గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హుజూర్ నగర్లో ప్రచారం నిర్వహించారు . ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే హుజూర్‌నగర్‌ కి పాత పేరు పోంచర్లగా మారుస్తారని ప్రకటించారు .

రాజా సింగ్ కాంగ్రెస్ ఇప్పుడే మునిగిపోయిన పార్టీ టిఆర్ఎస్ మునిగిపోతున్న పార్టీ అని ఎద్దేవా చేశారు. బీజేపీ తెరాస ముఖ్యమంత్రి కెసిఆర్ గారు తెలంగాణ ని  బంగారు తెలంగాణగా  చేస్తామని ప్రకటించారు కానీ అప్పుల తెలంగాణగా మారిందని విమర్శించారు .

హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక అక్టోబర్ 21న పోలింగ్ జరుగుతుంది మరియు అక్టోబర్ 24వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు పోలింగ్‌కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విధుల్లో ఉన్న అధికారులు సమర్థంగా పనిచేయాలని సాధారణ పరిశీలకుడు  ప్రతాప్ సింగ్ శుక్రవారం అందరినీ కోరారు.ప్రచారం చివరి రోజు కావడంతో అన్ని పార్టీలు కూడా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు వీలైనన్ని పథకాలను ప్రజలకు తెలిపేందుకు ప్రయత్నం చేస్తున్నారు.పార్టీ పెద్దలు అంత కూడా హుజూర్‌నగర్‌లో తిష్ట వేశారు . చూడాలి విజయం ఎవరిని వరిస్తుందో .


మరింత సమాచారం తెలుసుకోండి: