మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. మహారాష్ట్ర, హరియాణాలతో పాటు హుజూర్ నగర్ సహా 51 శాసనసభ స్థానాలకు ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. ఈ నెల 21వ తేదీన పోలింగ్ జరగనుండగా 24వ తేదీన కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. మహారాష్ట్రలో మొత్తం 285 అసెంబ్లీ స్థానాలకు, హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. 
 
బీజేపీ మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాలలో ఎలాగైనా గెలవాలని తీవ్రంగా కృషి చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఉపఎన్నికలకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. లోక్ సభ ఎన్నికలు ముగిసిన తరువాత తొలి అసెంబ్లీ ఎన్నికలు మహారాష్ట్ర, హరియాణాలో జరుగుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఫలితాల వైపు దేశ ప్రజలందరూ ఆసక్తిగా చూస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. 
 
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణమైన ఫలితాన్ని అందుకున్న తరువాత కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం పుంజుకోలేదు. బీజేపీతో పోలీస్తే కాంగ్రెస్ రెండు రాష్ట్రాలలో ప్రచారంలో కూడా పోటీ పడలేకపోయిందని తెలుస్తోంది. హరియాణాలో 90 స్థానాలకుగాను 1200 మందికి పైగా అభ్యర్థులు పోటీ చేస్తున్నట్లు సమాచారం. 3 కోట్ల మంది ఓటర్లు ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారని సమాచారం. 
 
ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్యే ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల కోడ్ ప్రకారం ఎన్నికల ప్రచార గడువు ముగిసింది. డబ్బు, మద్యం పంపిణీ జరగకుండా ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించినట్లు తెలుస్తోంది.పరిశీలకులు ఎక్కడికక్కడ మద్యం, డబ్బు పంపిణీ జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. భారీ స్థాయిలో పోలీసు బలగాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వ్యవసాయ రంగంలో క్షీణత, ఆర్థిక మందగమనం నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: